TS Schools To Run Half Day From March 15: సమ్మర్ ప్రారంభంలోనే భానుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. ఇప్పుడే సూర్యుడి భగభగలకు సామాన్య జనాలు తట్టుకోలేకపోతున్నారు. ఉదయం పది తర్వాత బైటకు వెళ్లాలంటేనే పలుమార్లు ఆలోచిస్తున్నారు. సాయంత్రం వరకు కూడా ఎండ వేడిమి ఎక్కువగా ఉంటుంది. పెద్ద వాళ్లే ఇంట్లో నుంచి బైటకు పనిమీద వెళ్లేవారు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తప్పనిసరైతే తప్ప.. బైటకు రావడానికి సాహాసించడంలేదు. ఏప్రిల్, మే నెలలో ఉండాల్సిన ఎండలు ఇప్పుడు ఫిబ్రవరిలోనే ఉన్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Read More: ToothBrush: మీ టూత్ బ్రష్ బాత్రూమ్ లో పెడుతున్నారా..?.. ఎంత పెద్ద ప్రమాదమో తెలుసా..?


ఈ క్రమంలో ఎండలు మండిపోతుండటంతో  తల్లిదండ్రులు బెంబెలెత్తిపోతున్నారు. తాజాగా,  తల్లిదండ్రులు విద్యాశాఖకు వేసవిలో ఎండలతీవ్రత పెరుగుతున్నందు తగిన చర్యలు తీసుకొవాలని కోరారు. దీన్ని పరిగణలోనికి తీసుకున్న విద్యాశాఖ ఈ నెల 15 నుంచి ఒంటిపూట బడులు నిర్వహించాలని ఆదేశాలు జారీచేసింది. మార్చి 15 నుంచి ఏప్రిల్ 23 వరకు రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ పాఠశాలల్లో ఒంటిపూట బడులు నిర్వహించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఉదయం 8  నుంచి మధ్యాహ్నం 12.30  వరకు బడులు నడపాలని విద్యాశాఖ ఆదేశాలు జారీచేసింది.  


పదవతరగతి స్టూడెంట్స్ కు యథావిధిగా ప్రత్యేక తరగతులు కొనసాగుతాయని ఉత్తర్వులలో పేర్కొంది. దీంతో ఎండల నుంచి ఇబ్బందులు పడుతున్న స్టూడెంట్స్ కు భారీ ఉపశమనంగా చెప్పుకొవచ్చు. ఎండలతో ప్రజలకు ఇప్పటికే బెంబెలెత్తిపోతున్నారు.  కొందరు చిన్నారులు ఇప్పటికే వడదెబ్బకు గురైనట్లు సమాచారం.


Read More: Niharika Konidela: చీరకట్టులో కనికట్టు చేస్తోన్న నిహారిక కొణిదెల.. మెగా డాటర్ లేటస్ట్ పిక్స్ వైరల్..


సమ్మర్ లో తప్పనిసరైతేనే బైటకు వెళ్లాలని వైద్యులు సూచిస్తున్నారు. నీళ్లు ఎక్కువగా తాగాలని, ఫ్రూట్స్ జ్యూస్ ఎక్కువగా తీసుకొవాలని, బాడీ డీహైడ్రేషన్ కాకుండా జాగ్రత్తలు తీసుకొవాలని సూచిస్తున్నారు. ఎవరికైన వడదెబ్బ తగిలితే వెంటనే .. వారికి నీడలోకి తీసుకెళ్లి, గాలి ఆడేటట్లు చేయాలని, ప్రాథమిక చికిత్స చేసి వైద్యుల దగ్గరకు తీసుకెళ్లాలని నిపుణులు చెబుతున్నారు. 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 


Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook