Telangana Election 2023 Results: తెలంగాణ హస్తగతం.. అంబరాన్ని అంటిన కాంగ్రెస్ సంబరాలు
Telangana Election 2023 Results: దాదాపు పది సంవత్సరాల తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ గెలుపు దిశగా పయనించడంతో.. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి.. ఆ వివరాలు ఒకసారి చూద్దాం..
Telangana Elections Counting Updates: తెలంగాణలో కాంగ్రెస్ సంబరాలు అంబరాన్ని అంటాయి. ఎగ్జిట్ పోల్స్ లో అంచనా వేసినట్లే కాంగ్రెస్ పూర్తి మెజార్టీతో దూసుకుపోతుంది. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి పెద్దగా పోటీ లేకుండా ఉండేది. కానీ ఇప్పుడు అలా కాదు ఎన్నో లోకల్ పార్టీలు కాంగ్రెస్ కన్నా తమ తమ రాష్ట్రాలలో ఆధిక్యంలోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో ముఖ్యంగా కాంగ్రెస్ బాగా బలంగా ఉండే తెలంగాణలో కూడా దాదాపు పది సంవత్సరాలు కాంగ్రెస్ మాటే లేకుండా పోయింది. ఈ పదేళ్లు అక్కడ సీఎం కేసీఆర్ తిరుగులేని కింగ్ గా ఏలారు. అయితే మళ్లీ ఇప్పుడు పది సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ కేసీఆర్ పైన తన సత్తా చాటుకుంటొంది.
దాదాపు 65 స్థానాల్లో కాంగ్రెస్ ఆధిక్యం సంపాదించడంతో ఆల్రెడీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ సంబరాలు మొదలైపోయాయి. ఎన్నికల కౌంటింగ్‌లో ఆదినుంచీ కాంగ్రెస్ దూసుకుపోతోంది. ఇక ఏకంగా ఇప్పుడు 65 స్థానాల్లో ఆధిక్యం సాధించడంతో రాష్ట్ర వ్యాప్తంగా నగరంలో కాంగ్రెస్ శ్రేణులు సంబరాల్లో మునిగి తేలుతున్నారు. కాంగ్రెస్ నేత టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నివాసం వద్ద కూడా బాణా సంచాపేల్చి కాంగ్రెస్ కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు.
పాలకుర్తిలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఓటమిపాలయ్యారు. ఇక్కడ యశస్విని రెడ్డి విజయం సాధించారు. నిర్మల్‌లో బీజేపీ అభ్యర్థి మహేశ్వర్ రెడ్డి గెలుపొందారు. నారాయణఖేడ్‌లో కాంగ్రెస్ అభ్యర్థి 5 వేల ఓట్ల తేడాతో విజయం సాధించారు. మెదక్‌లో పద్మాదేవేందర్ రెడ్డిపై మైనంపల్లి రోహిత్ రెడ్డి గెలుపొందారు. ప్రస్తుతం కాంగ్రెస్ అభ్యర్థులు 17 సీట్లలో విజయం సాధించగా.. మరో 49 సీట్లలో ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
Also read: Madhya Pradesh Election Result 2023: మధ్యప్రదేశ్ లో ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం.. ఆధిక్యంలో బీజేపీ..
Also Read: Animal Movie: బాక్సాఫీస్ వద్ద 'యానిమల్' ఊచకోత.. ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook