Congress In Telangana: 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఒకప్పుడు కాంగ్రెస్  పార్టీకి పెద్దగా పోటీ లేకుండా ఉండేది. కానీ ఇప్పుడు అలా కాదు ఎన్నో లోకల్ పార్టీలు కాంగ్రెస్ కన్నా తమ తమ రాష్ట్రాలలో ఆదిత్యంలోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో ముఖ్యంగా కాంగ్రెస్ బాగా బలంగా ఉండే తెలంగాణలో కూడా దాదాపు పది సంవత్సరాలు కాంగ్రెస్ మాటే లేకుండా పోయింది. ఈ పదేళ్లు అక్కడ సీఎం కేసీఆర్ తిరుగులేని మినిస్టర్ గా ఏలాడు. అయితే మళ్లీ ఇప్పుడు పది సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ కేసీఆర్ పైన తన సత్తా చాటుకుంటొంది.


దాదాపు 65 స్థానాల్లో కాంగ్రెస్ ఆధిక్యం సంపాదించడంతో ఆల్రెడీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ సంబరాలు మొదలైపోయాయి. ఎన్నికల కౌంటింగ్‌లో  ఆదినుంచీ కాంగ్రెస్‌ దూసుకుపోతోంది. ఇక ఏకంగా ఇప్పుడు 65 స్థానాల్లో ఆదిత్యం సంపాదించగా హైదరాబాద్‌ నగరంలో కాంగ్రెస్‌ శ్రేణులు సంబరాల్లో మునిగి తేలుతున్నారు.  కాంగ్రెస్‌ నేత టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి నివాసం వద్ద కూడా బాణా సంచాపేల్చి కాంగ్రెస్‌  కార్యకర్తలు  సంబరాలు చేసుకున్నారు. 


తెలంగాణలో సీఎం కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి అవుతారా లేదా అని అనుమానం సాగుతున్న సమయంలో.. ఈ ఫలితాలు చూశాక తప్పకుండా ఈసారి సీఎం కేసీఆర్ కాదు అని అర్థమయిపోతోంది. అత్యధిక మెజారిటీతో కేసీఆర్ ని ఓడించి కాంగ్రెస్ పార్టీ దూసుకుపోదాం ఖాయం అన్నట్టు తేలిపోయింది.


మొత్తానికి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎవ్వరూ ఊహించని విధంగా నమోదువుతున్నాయి. హైదరాబాదులో తప్ప ఔట్ అండ్ ఔట్‌గా తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ గాలి బలంగా వీస్తోంది. ఇందులో మరో గమనించాల్సిన విషయం ఏమిటి అంటే .. సిరిసిల్లో మంత్రి అలానే ముఖ్యమంత్రి కేసీఆర్ కొడుకు కేటీఆర్ తన నియోజకవర్గంలో వెనుకంజలో ఉన్నారు. తొలి రౌండ్‌లో మంత్రి కేటీఆర్ వెనుకంజలో కొనసాగుతున్నారు. ఇక మొత్తానికి అన్ని రౌండ్ ముగియకముందే కాంగ్రెస్ మాత్రం తాను తప్పకుండా విని అవుతామనే బలమైన నమ్మకంతో తెగకు ఖుషి గా సంబరాలు చేసుకుంటోంది.


Also read: Madhya Pradesh Election Result 2023: మధ్యప్రదేశ్ లో ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం.. ఆధిక్యంలో బీజేపీ..


 


Also Read: Animal Movie: బాక్సాఫీస్ వద్ద 'యానిమల్' ఊచకోత.. ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?


 



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


 


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook