Assembly Election 2023: తెలంగాణపై కాంగ్రెస్ వ్యూహం, ట్రబుల్ షూటర్ చేతికి మొత్తం బాధ్యతలు
Assembly Election 2023: తెలంగాణ ఎన్నికల కౌంటింగ్ రేపు జరగనుంది. మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ పార్టీకు పట్టం కడుతున్నాయి. అదే సమయంలో హంగ్ లేదా అస్పష్టమెజార్టీ పరిస్థితులు కూడా లేకపోలేదనే అంచనా ఉంది. అందుకే కాంగ్రెస్ అధిష్టానం మేజర్ స్కెచ్ వేసింది.
Assembly Election 2023: తెలంగాణ ఎన్నికల ఫలితాలకు మరి కొద్దిగంటల సమయం మిగిలింది. రేపటి ఫలితాలు మేజిక్ ఫిగర్‌కు అటూ ఇటూ ఉంటే ఏం చేయాలి, ఎమ్మెల్యేల్ని ఎలా పట్టి ఉంచాలనేది ఏ పార్టీకైనా అత్యంత కీలకం. అందుకే కాంగ్రెస్ పార్టీ ఇప్పట్నించే వ్యూహం సిద్ధం చేసింది. మొత్తం వ్యవహారాన్ని ఆయన చేతిల్లో పెట్టింది.
తెలంగాణ ఎన్నికల ఫలితాలు రేపు వెలువడనున్నాయి. దాదాపు ఎగ్జిట్ పోల్స్ అన్నీ కాంగ్రెస్ పార్టీకు మొగ్గు చూపుతున్నాయి. అదే సమయంలో బీఆర్ఎస్ కూడా మేజిక్ ఫిగర్‌కు కొద్దిదూరంలో ఆగే అవకాశాలు కూడా ఉన్నాయని తెలుస్తోంది. ఫలితాలు మేజిక్ ఫిగర్‌కు అటూ ఇటూ ఉండే ఎమ్మెల్యేల్ని కాపాడుకునేందుకు కాంగ్రెస్ పార్టీ వ్యూహం సిద్ధం చేసింది. పార్టీలో ఎప్పుడు ఏ సమస్య వచ్చినా ట్రబుల్ షూటర్ గా వ్యవహరించే కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌కు మొత్తం బాధ్యతలు అప్పగించింది. దీనికోసం కాంగ్రెస్ పార్టీ వ్యూహం అవలంభించనుంది.
ఏఐసీసీ ప్రతి నియోజకవర్గానికి ఓ పరిశీలకుడిని ఇప్పటికే నియమించింది. సదరు అభ్యర్ధి గెలిచిన తరువాత రిటర్నింగ్ అధికారి ఇచ్చే ధృవీకరణ పత్రం తీసుకుని ఎన్నికల పరిశీలకునితో కలిసి తాజ్ కృష్ణా హోటల్‌కు వెళ్తారు. అక్కడ డీకే శివకుమార్ సమక్షంలో ఉంటారు. పూర్తి మెజార్టీ వచ్చినా సరే ఇదే వ్యూహాన్ని అవలంభించాలనేది డీకే ప్లాన్. ఎమ్మెల్యేలు ఎట్టి పరిస్తితుల్లోనూ ప్రలోభాలకు గురి కాకుండా ఉండేలా చూసుకుంటున్నారు.పైకి మాత్రం ఏ విధమైన క్యాంపు రాజకీయాలు పెట్టడం లేదని డీకే శివ కుమార్ స్పష్టం చేశారు. ఇప్పటికే కొంతమంది ఎమ్మెల్యేలను ప్రలోభపెడుతున్నట్టు సమాచారముందని డీకే తెలిపారు.
Also read: Telangana Election Results 2023: తెలంగాణ ఓట్ల లెక్కింపుకు ఏర్పాట్లు పూర్తి, కౌంటింగ్ ప్రక్రియ ఇలా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook