Telangana Election Results 2023: దేశవ్యాప్తంగా ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగినా తెలంగాణపై ప్రత్యేక దృష్టి నెలకొంది. ఎగ్జిట్ పోల్స్ అన్నీ కాంగ్రెస్ పార్టీకే పట్టం కట్టడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. రాష్ట్రవ్యాప్తంగా 119 నియోజకవర్గాలకు 49 కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటయ్యాయి. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మరి కొద్దిగంటల్లో ప్రారంభం కానున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. కౌంటింగ్ కేంద్రాల వద్ద 40 కేంద్ర కంపెనీ బలగాలతో మూడంచెల భద్రత ఏర్పాటైంది. రాష్ట్రవ్యాప్తంగా 2,290 మంది అభ్యర్ధుల భవితవ్యం రేపు తేలనుంది. కౌంటింగ్ కేంద్రాల వద్ద సీసీ కెమేరాలు ఏర్పాటు చేశారు. కౌంటింగ్ కోసం మొత్తం 1766 టేబుల్స్ ఏర్పాటయ్యాయి. ఒక్కొక్క నియోజకవర్గానికి 14 టేబుల్స్ ఉంటాయి.  ప్రతి టేబుల్ వద్ద ఎన్నికల సిబ్బంది నలుగురు ఉంటారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపుకై ప్రతి 500 ఓట్లకు ఒక టేబుల్ ఏర్పాటు చేశారు. ఈసారి తెలంగాణలో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ 1.80 లక్షలుంది. తొలి అరగంట పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ఉండటంతో 8.30  తరువాతే ఈవీఎం లెక్కింపు ఉంటుంది. అంటే మొదటి రౌండ్ ఫలితం వచ్చేసరికి 9 గంటలు కావచ్చు. ఆ తరువాత ప్రతి 20 నిమిషాలకు ఒక రౌండ్ ఫలితం తేలనుంది. 


కూకట్‌పల్లి, ఉప్పల్, మల్కాజ్‌గిరి, పఠాన చెరువు, నియోజకవర్గాల్లో పోలింగ్ కేంద్రాలు 400 పైగా ఉండటంతో ఇక్కడ మాత్రం 20 టేబుల్స్ ఏర్పాటయ్యాయి. ఇక రాజేంద్రనగర్, ఎల్బీనగర్, శేర్‌లింగంపల్లి, మహేశ్వరం, మేడ్చల్ నియోజకవర్గాల్లో 500 పైగా పోలింగ్ కేంద్రాలుండటంతో 28 టేబుల్స్ ఏర్పాటు చేశారు. ప్రతి ఈవీఎంను మూడు సార్లు లెక్కిస్తారు. అందుకే ఫలితాలు కాస్త ఆలస్యంగా వెల్లడయ్యే అవకాశాలున్నాయి. 


ఇక కౌంటింగ్ కేంద్రాల వద్ద భారీ భద్రతతో పాటు ఆంక్షలు విధించింది ఎన్నికల సంఘం. కౌంటింగ్ కేంద్రాల వద్ద సెక్షన్ 144 అమల్లో ఉంటుంది. కౌంటింగ్ సందర్భంగా రోడ్లపై ర్యాలీలు, టపాసులు కాల్చడం, ఊరేగింపులు నిషేదం. మద్యం దుకాణాలు మూసివేసుంటాయి. మద్యాహ్నం 1 గంటకు తెలంగాణ ఫలితాలపై స్పష్టత రావచ్చు. 


తెలంగాణలో మొత్తం ఓట్ల సంఖ్య 3,26,02,793 కాగా అందులో 2,32,59,256 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. అంటే 71 శాతం పోలింగ్ నమోదైంది. యాదాద్రి జిల్లాలో అత్యధికంగా 90.36 శాతం పోలింగ్ నమోదు కాగా ఆలేరు నియోజకవర్గంలో 90.77 శాతం పోలింంగ్ నమోదైంంది. అత్యల్పంగా యాకుత్ పురాలో 39.64 శాతం పోలింగ్ నమోదైంది. 


Also read: Telangana Exit Polls 2023: 2018లో నిజమైన ఇండియా టుడే ఎగ్జిట్ పోల్, ఈసారి ఏం చెప్పింది
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook