Telangana Election Results 2023: తెలంగాణ ఎన్నికల్లో ఫలితాలు ఎగ్జిట్ పోల్స్‌కు తగ్గట్టే ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన మెజార్టీతో అధికారానికి చేరువలో ఉంది. బీజేపీతో పొత్తు కుదుర్చుకుని 8 సీట్లలో పోటీ చేసిన జనసేనాని పవన్ కళ్యాణ్‌కు గట్టి షాక్ తగిలింది. ఎన్నికల్లో మరోసారి బోర్లా పడ్డారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తెలంగాణ ఎన్నికల్లో 69 స్థానాల్లో స్పష్టమైన మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ దూసుకుపోతోంది. ఇక అధికారం కైవసం మాత్రమే మిగిలింది. అధికార బీఆర్ఎస్ 37-39 స్థానాల్లో ఆధిక్యం కనబరుస్తోంది. బీజేపీ 7-8 స్థానాల్లో, ఎంఐఎం 4-5 స్థానాల్లో ఆధిక్యం కనబరుస్తున్నాయి. తెలంగాణ ఓటరు స్పష్టమైన మెజార్టీ ఇచ్చాడు. తెలంగాణ ఎన్నికల్లో జనసేన తొలిసారిగా పోటీ చేసింది. బీజేపీతో పొత్తు కుదుర్చుకుని 8 స్థానాల్లో పోటీ చేసింది. బీజేపీతో పొత్తులో భాగంగా కూకట్‌పల్లి నుంచి ప్రేమ్ కుమార్, తాండూరు నుంచి శంకర్ గౌడ్, నాగర్ కర్నూలు నుంచి లక్ష్మణ్ గౌడ్, కోదాడ నుంచి మేకల సతీష్ రెడ్డి, ఖమ్మం నుంచి రామకృష్ణ, వైరాలో సంపత్ నాయక్, కొత్తగూడెం నుంచి సురేందర్ రావు, అశ్వారావు పేట నుంచి ఉమాదేవి పోటీ చేశారు. 


జనసేన-బీజేపీ తరపున పవన్ కళ్యాణ్ నేరుగా ప్రచారం చేశారు. వరంగల్, సూర్యాపేట, కొత్తగూడెం సభల్లో కూకట్ పల్లిలో రోడ్ షోలు నిర్వహించారు. ఊహించినట్టే సినిమా క్రేజ్‌తో భారీగా జనం తరలివచ్చారు. అనూహ్య స్పందన లభించింది. అటు ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాతో కలిసి బహిరంగసభల్లో కూడా పాల్గొన్నారు. అయినా జనసేన ఏ మాత్రం ప్రభావం చూపించలేకపోయింది. జనసేన పోటీ చేసిన 8 స్థానాల్లో అభ్యర్దులు డిపాజిట్లు కోల్పోయారు. 


అటు బీజేపీకు సైతం ఊహించని షాక్ తగిలింది. బీజేపీకు చెందిన హేమాహేమీలు బండి సంజయ్, ధర్మపురి అరవింద్, రఘునందన్‌రావు, ఈటెల రాజేందర్, రాజాసింగ్‌లు వెనుకంజలో ఉన్నారు. ఏపీలో 2019 ఎన్నికల్లో కూడా జనసేన ఘోరంగా విఫలమైంది. పవన్ కళ్యాణ్ పోటీచేసిన 2 స్థానాల్లోనూ ఓడిపోయారు. ఇప్పుడు మరోసారి పార్టీ ఘోరంగా ఓడిపోవడంతో జనసేనానికి ఉన్నది కేవలం సినిమా క్రేజేనని విమర్శించేవాళ్లకు ఊతం లభించినట్టయింది.


Also read: Telangana Election Results 2023: మంత్రులెందుకు ఓడిపోయారు, అవినీతే కారణమా



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook