Janasena-Bjp: ఎన్డీయేలో భాగస్వామ్యంగా ఉన్న జనసేన బీజేపీతో కలిసి పోటీ చేసేందుకు సిద్ధమైంది. ఏపీలో టీడీపీతో కలిసి, తెలంగాణలో బీజేపీతో కలిసి పోటీకు రెడీ అయింది. మరి ఏ పార్టీకు ఎన్ని సీట్లు కేటాయిస్తున్నారనేది ఒకట్రెండు రోజుల్లో స్పష్టత రానుందని తెలుస్తోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించిన జనసేన మొత్తం 119 నియోజకవర్గాల్లో 32 నియోజకవర్గాలో పోటీ చేస్తామని ప్రకటించింది. ఆ తరువాత బీజేపీ-జనసేన పొత్తులో భాగంగా 30 స్థానాల్లో పోటీ చేయడానికి సిద్ధమైంది. ఏపీలో బీజేపీ సమ్మతి లేకుండానే టీడీపీతో కలిసి పోటీ చేసేందుకు సిద్ధమైన జనసేనాని పవన్ కళ్యాణ్ తెలంగాణలో మాత్రం బీజేపీ కావాలని కోరుకుంటున్నారు. ఇప్పటికే కిషన్ రెడ్డి, డాక్టర్ లక్ష్మణ్‌లతో చర్చలు జరిగాయి. స్థానికంగా అవగాహన వచ్చిన తరువాత బీజేపీ ఢిల్లీ పెద్దలు అమిత్ షా, జేపీ నడ్డాలతో తెలంగాణ బీజేపీ నేతలు కిషన్ రెడ్డి, డాక్టర్ ఎం లక్ష్మణ్‌లు సమావేశమయ్యారు. తెలంగాణలో రెండుపార్టీల మధ్య పొత్తు దాదాపుగా ఖరారైందగి. 


జనసేన రాష్ట్రంలో 30 స్థానాలు కోరుతుంటే బీజేపీ మాత్రం 7-15 సీట్ల వరకూ కేటాయించే ఆలోచన చేస్తోంది. అది కూడా ఆంధ్రా సరిహద్దు కలిగిన ఉమ్మడి ఖమ్మం, నల్గొంండతో పాటు ఆంధ్రా సెటిలర్లు అత్యధికంగా ఉన్న గ్రైట్ హైదరాబాద్ పరిధిలోని 2-3 నియోజకవర్గాలు కేటాయించాలని భావిస్తోంది. మొత్తంగా చూస్తే బీజేపీ బలహీనంగా ఉన్న ప్రాంతాల్ని జనసేనకు కట్టబెట్టాలనేది బీజేపీ వ్యూహంగా ఉంది. 


గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పఠాన్ చెరువు, శేర్‌లింగంపల్లి, కూకట్ పల్లి, కుత్బుల్లాపూర్, మేడ్చల్, మల్కాజ్‌గిరి, ఉప్పల్, ఎల్బీ నగర్, రాజేంద్రనగర్, ఇబ్రహీంపట్నం, సనత్ నగర్, ఖైరతాబాద్, జూబ్హీహిల్స్ స్థానాలను జనసేన ఆశిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ స్థానాల్లో బీజేపీకు బలమైన అభ్యర్ధులుండటంతో బీజేపీ నిరాకరించవచ్చు. బీజేపీ-జనసేన పొత్తుతో కచ్చితంగా లబ్ది జరగవచ్చనేది విశ్లేషకుల అంచనా. కానీ బీజేపీ బీసీ నినాదం ఎత్తుకోవడంతో పవన్ కళ్యాణ్‌కు మద్దతిచ్చే కాపు సామాజికవర్గం ఓట్లు పోలరైజ్ అవుతాయా అనేది ప్రశ్నార్ధకంగానే మారింది. 


Also read: Minister Harish Rao: రైతుల జోలికి వస్తే ఖబర్దార్.. మంత్రి హరీష్‌ రావు సీరియస్ వార్నింగ్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook