Telangana Elections 2023: తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని వైఎస్సార్టీపీ ప్రకటించడం చర్చనీయాంశంగా మారుతోంది. బలం లేక పోటీ చేయడం లేదా, లేక మరేదైనా కారణముందా అనే ప్రశ్నలు విన్పిస్తున్నాయి. కాంగ్రెస్‌తో విలీనానికి బ్రేక్ పడినా ఆ పార్టీకు మద్దతిస్తానని చెప్పడంపై చాలా ప్రశ్నలే వస్తున్నాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తెలంగాణ ఎన్నికలు సమీపిస్తున్నాయి. తెలంగాణలో బీజేపీ ప్రభావం తగ్గి కాంగ్రెస్ ప్రభావం పెరిగింది. అధికార బీఆర్ఎస్‌కు గట్టి పోటీ ఇస్తోంది. ఏపీలో వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన కొన్నాళ్లకు జగన్ సోదరి వైఎస్ షర్మిల తెలంగాణలో వైఎస్సార్ తెలంగాణ పేరుతో కొత్త పార్టీ స్థాపించి విస్తృతంగా పాదయాత్ర జరిపారు. పాదయాత్రకు ఆరంభంలో స్పందన అద్భుతంగా లభించింది. ఆ తరువాత జరిగిన వివిధ పరిణామాలు, కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలో రావడంతో వైఎస్సార్టీపీని కాంగ్రెస్‌లో విలీనం చేసే ప్రక్రియ ముందుకు సాగింది. దాదాపు పూర్తయిందనుకునే తరుణంలో ఆ ప్రక్రియకు బ్రేక్ పడింది. దాంతో మొత్తం 119 స్థానాల్లో పోటీ చేస్తున్నామని ప్రకటించిన వైఎస్ షర్మిల మళ్లీ ఎందుకో ఒక్కసారిగా వెనక్కి తగ్గారు. పోటీ నుంచి తప్పుకోవడమే కాకుండా కాంగ్రెస్ పార్టీకు బేషరతుగా మద్దతు తెలిపారు. 


ఇదే ఇప్పుడు అటు తెలంగాణ, ఇటు ఏపీలో చర్చనీయాంశమౌతోంది. షర్మిల తాను పోటీ చేయాలని భావించిన పాలేరులో కాంగ్రెస్ నుంచి వైఎస్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడిగా ఉన్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బరిలో ఉండటంతో షర్మిల ఇబ్బందుల్లో పడ్డారని తెలుస్తోంది. పొంగులేటి శీనన్నను ఎలా ఓడిస్తానని ఆమె చేసిన వ్యాఖ్యలే ఇందుకు కారణం. 


వైఎస్ షర్మిల పార్టీ పోటీ నుంచి తప్పుకోవడంపై వైఎస్ జగన్ ప్రమేయముందనే వార్తలు గట్టిగా విన్పిస్తున్నాయి. రాజకీయంగా కాంగ్రెస్ పార్టీని ఏపీలో భూస్థాపితం చేసిన జగన్..కాంగ్రెస్ పార్టీకు అనుకూలంగా మారుతున్నారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఎందుకంటే పొంగులేటి జగన్ ఆశీస్సులతోనే కాంగ్రెస్ పార్టీ తీర్ధం పుచ్చుకున్నారు. ఇక కర్ఠాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌తో అటు షర్మిల, ఇటు జగన్‌కు ఉన్న సాన్నిహత్య సంబంధాలు తెలంగాణ రాజకీయాలపై జగన్ ప్రభావాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఇప్పటికీ షర్మిల జగన్ వదిలిన బాణంగానే ఉందనే ప్రచారం మరోసారి వ్యాపిస్తోంది. 


అదే సమయంలో కాంగ్రెస్ పార్టీకు బేషరతుగా మద్దతివ్వడంపై ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి వ్యతిరేక స్పందన వ్యక్తం కాలేదు. ఆమె పార్టీ..ఆమె ఇష్టమని ప్రభుత్వ సలహాదారుడు సజ్జల చేసిన వ్యాఖ్యలు ఇందుకు ఉదాహరణ. అందుకే ముఖ్యమంత్రి జగన్ వ్యూహంలో భాగంగానే వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీకు బేషరతు మద్దతు ప్రకటించారనే వాదన విన్పిస్తోంది. దేశంలో చాలా రాష్ట్రాల్లో బీజేపీ గ్రాఫ్ తగ్గుతుండటంతో జగన్ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారా అనే సందేహాలు వ్యక్తమౌతున్నాయి. 


Also read: CM KCR Speech: దేశంలో రైతు బంధును సృష్టించిందే నేను.. రాహుల్ గాంధీకి ఎద్దు, ఎవుసం ఎరుకనా..?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook