Telangana Election Results 2023: తెలంగాణలో కొనసాగుతున్న కౌంటింగ్, వెనుకంజలో కేసీఆర్
Telangana Election Results 2023: తెలంగాణ సహా దేశంలో నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. కాంగ్రెస్ ఆధిక్యం కొనసాగిస్తుంటే ముఖ్యమంత్రి కేసీఆర్ వెనుకంజలో ఉండటం గమనార్హం. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Telangana Election Results 2023: తెలంగాణ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కాగా ముందు పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు జరిగింది. ప్రస్తుతం ఈవీఎం కౌంటింగ్ జరుగుతోంది. దక్షిణ తెలంగాణలో కాంగ్రెస్, ఉత్తర తెలంగాణలో బీఆర్ఎస్-కాంగ్రెస్, హైదరాబాద్ పరిధిలో బీఆర్ఎస్ ఆధిక్యం కన్పిస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం వెనుకంజలో ఉండటం ఆశ్చర్యం కల్గిస్తోంది.
తెలంగాణ కౌంటింగ్ ప్రారంభమైంది. ప్రస్తుతం 63 స్థానాలతో కాంగ్రెస్ స్పష్టమైన ఆధిక్యంలో ఉంటే బీఆర్ఎస్ 40 స్థానాల్లో మెజార్టీలో ఉంది. ఇక బీజేపీ 6 స్థానాల్లో, మజ్లిస్ 6 స్థానాల్లో ఆదిక్యంలో ఉంది. కాంగ్రెస్ పార్టీకు ఇప్పటి వరకూ 40 శాతం, బీజేపీకు 38 శాతం ఓటింగ్ షేర్ వచ్చినట్టు తెలుస్తోంది. ఇక రెండేసి స్థానాల్లో పోటీ చేసిన కేసీఆర్, రేవంత్ రెడ్డిల పరిస్థితి పరిశీలిద్దాం. ముఖ్యమంత్రి కేసీఆర్ గజ్వేల్ స్థానం నుంచి ఆధిక్యంలో ఉంటే కామారెడ్డి నియోజకవర్గంలో మాత్రం కేసీఆర్..అనూహ్యంగా వెనుకంజలో ఉన్నారు.
ఇక కాంగ్రెస్ అభ్యర్ధి రేవంత్ రెడ్డి అటు కొడంగల్, ఇటు కామారెడ్డి రెండు స్థానాల్లోనూ ఆధిక్యంలో ఉన్నారు. కామారెడ్డిలో పోటీ రేవంత్ రెడ్డికు బీజేపీకు మద్య ఉంది. కేసీఆర్ మూడో స్థానంలో ఉన్నారు. ఇక కొడంగల్‌లో మాత్రం రేవంత్ రెడ్డి మెజార్టీ చాలా తక్కువే కన్పిస్తోంది. కరీంనగర్ నుంచి బండి సంజయ్ వెనుకంజలో ఉన్నారు. కోమటిరెడ్డి సోదరులు ఇద్దరూ ఆధిక్యంలో ఉన్నారు. దుబ్బాకలో బీజేపీ అభ్యర్ధి రఘునందన్ రావు వెనుకంజలో ఉన్నారు.
బీఆర్ఎస్ మంత్రులు ప్రశాంత్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, పువ్వూడ అజయ్, కొప్పుల ఈశ్వర్ వెనుకంజలో ఉన్నారు.
Also read: Five State Elections 2023: ఆసక్తి రేపుతున్న 4 రాష్ట్రాల ఫలితాలు, ఎగ్జిట్ పోల్స్ అంచనాలు మారవచ్చా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook