Lachi Reddy: తెలంగాణ ఉద్యోగ సంఘంలో ఇప్పుడు ఒక కొత్త పేరు తరుచూ వినపడుతుంది. గత ప్రభుత్వ హయాంలో లూప్ లైన్ లో ఉన్న ఆ అధికారి ఇప్పుడు మాత్రం రేవంత్ సర్కార్ పై ఈగ వాలకుండా చూసుకుంటున్నాడు. ఉద్యోగ సంఘాలన్నింటినీ ఏకతాటిపైకి తీసుకువచ్చి ప్రభుత్వానికి అండగా ఉండేలా ప్లాన్ చేస్తున్నాడు. ప్రభుత్వానికి మీకు నేను వారధిగా ఉంటా ..కాస్తా రేవంత్ ప్రభుత్వం పట్ల వ్యతిరేకతను ప్రదర్శించకుండా ఉండాలని ఆ అధికారి చెబుతున్నాడట. ఇటీవల వరదల విషయంలో ప్రభుత్వానికి విరాళాల సేకరించడంలో కూడా ఆయనదే కీ రోల్ అ. ఇంతకీ ఎవరా అధికారి..? ఎందుకు ఆయన ఇదంతా చేస్తున్నాడు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

లచ్చిరెడ్డి..ఇప్పుడు తెలంగాణ ఉద్యోగ సంఘాల్లో మారు మోగుతున్న పేరు. డిప్యూటీ కలెక్టర్ హోదాలో ఉన్న లచ్చిరెడ్డి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకా చాలా యాక్టివ్ అయ్యారు. తెలంగాణ ఉద్యమ సమయం నుంచి చాలా యాక్టివ్ గా ఉన్న లచ్చిరెడ్డి బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక కూడా కొద్ది రోజులు అప్పటి ప్రభుత్వ పెద్దలతో సత్సంబంధాలు కలిగే ఉండేవాడు. కేసీఆర్ సర్కార్ రెవెన్యూ శాఖలో తీసుకున్న నిర్ణయాలకు బేషరతుగా మద్దతు తెలుపుతూ వచ్చారు. అంతే కాదు కేసీఆర్ కు అత్యంత సన్నిహితుల్లో ఒకరిగా లచ్చిరెడ్డి మారాడు. తాను అనుకున్న చోట పోస్టింగ్ కూడా కేసీఆర్ అంగీకరించాడు. కీసర ఆర్డిఓగా చాలా రోజుల పాటు లచ్చిరెడ్డి పనిచేశాడు. అప్పటి వరకు బాగానే ఉంది. కానీ ఏం జరిగిందో తెలియదు కానీ ఉన్నట్లుండి కేసీఆర్, లచ్చిరెడ్డి మధ్య పెద్ద గ్యాప్ ఏర్పడింది. ఆ గ్యాప్ కారణంగానే లచ్చిరెడ్డి కీసర నుంచి అకస్మిక బదిలీ జరిగిందని అప్పట్లో ఉద్యోగ సంఘాల్లో పెద్ద చర్చే నడిచింది. ఇక ఆ నాటి నుంచి లచ్చిరెడ్డి పూర్తిగా బీఆర్ఎస్ కు దూరమయ్యాడు. 


ఇదే సమయంలో మరో వివాదంలో కూడా లచ్చిరెడ్డి ఇరుక్కున్నారు. కేసీఆర్ కేబినెట్ లో ఆరోగ్యశాఖ మంత్రిగా ఉన్న ఈటెల రాజేందర్ తో సమావేశం కావడం అప్పట్లో పెద్ద రాజకీయ అలజడిని సృష్టించింది. ఈ వ్యవహారం ఒక రకంగా ఈటెల రాజేందర్ ను బీఆర్ఎస్ నుంచి సాగనంపేలా చేసింది . రెవెన్యూ శాఖలో కొన్ని కీలక మార్పులు తేవాలని అప్పటి కేసీఆర్ సర్కార్ నిర్ణయించింది. దీనిలో భాగంగా తహశీల్దార్ అధికారాలకు చెక్ పెట్టే అవకాశం ఉందని ప్రచారం జరిగింది. ఈ విషయం ఈటెల రాజేందర్ రెవెన్యూ ఉద్యోగులకు చెప్పారనేది కేసీఆర్ అనుమానం. అయితే ఈటెల ఆ సమాచారం లచ్చిరెడ్డితో పంచుకున్నారని ఈటెలపై కేసీఆర్ అగ్గిమీద గుగ్గిలం అయ్యారు. దీంతో అప్పటికే లచ్చిరెడ్డి మీద తీవ్ర ఆగ్రహంతో ఉన్న కేసీఆర్ కు  ఈ వ్యవహారం అంతా కూడా పుండు మీద కారం పొడి చల్లినట్లు అయ్యింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా  ఆందోళన చేసే అవకాశం ఉందని గ్రహించిన కేసీఆర్ లచ్చిరెడ్డి ప్రాధాన్యతను పూర్తిగా తగ్గించాడు. దీంతో కేసీఆర్ పై లచ్చిరెడ్డి రగిలిపోయాడు.


అయితే ఇది ఇలా ఉంటే .మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో  కాంగ్రెస్ గెలిచాక పరిస్థితి పూర్తిగా మారిపోయింది. రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక లచ్చిరెడ్డికి మళ్లీ పాత రోజులు వచ్చాయి. రేవంత్ సర్కార్ లోని కీలక వ్యక్తులతో మంచి సంబంధాలు కలిగి ఉన్న లచ్చిరెడ్డి ఉద్యోగ సంఘాల్లో ఆక్టివ్ అయ్యారు. డిప్యూటీ కలెక్టర్ అసోసియేషన్ అధ్యక్షులుగా ఉన్న లచ్చిరెడ్డి ఇటీవల ఉద్యోగ సంఘాల జేఏసీకీ ఛైర్మన్ గా ఎన్నికయ్యారు. ఉద్యోగులకు సంబంధించిన పెండింగ్ అంశాలతో ఇతర అంశాలపై తాను పూర్తిగా దృష్టిపెడుతానని లచ్చిరెడ్డి ప్రకటించారు. అంతే కాదు వీలైనంత త్వరలో అన్ని ఉద్యోగ సంఘాలతో కలిసి రేవంత్ రెడ్డిని కలిసేందుకు చొరవ తీసుకుంటున్నట్లు కూడా లచ్చిరెడ్డి తెలిపారు. రేవంత్ సర్కార్ ఉద్యోగుల సమస్యల పట్ల పూర్తి సానుకూలంగా ఉందని లచ్చిరెడ్డి తెలిపారు.


ఒక రకంగా చెప్పాలంటే ప్రభుత్వానికి లచ్చిరెడ్డి పూర్తి వెన్నుదన్నుగా నిలుస్తున్నాడు. ప్రభుత్వంపై ఈగ వాలకుండా చూసుకుంటున్నాడు. రాష్ట్రంలో భారీ వర్షాల నేపథ్యంలో అన్ని విభాగాల ప్రభుత్వ ఉద్యో గులు అప్రమత్తంగా ఉండాలని కూడా లచ్చిరెడ్డి కోరారు . ముందస్తుగా ఉద్యోగులు తగు జాగ్రత్తలు తీసుకుంటూనే సహాయక చర్యలలో భాగస్వాములు కావాలన్నారు. ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి సమాచారం ఇస్తూ వరద నష్టాన్ని నివారించాలని కోరారు. ఒక రకంగా వరదల వల్ల రేవంత్ సర్కార్ కు ఏ రకమైన ఇబ్బంది కలగకుండా అందరం కలిసి పని చేయాలని లచ్చిరెడ్డి చెప్పాడు.అంతే కాదు ప్రభుత్వం తీసుకుంటున్న అనేక నిర్ణయాలకు ఉద్యోగ సంఘాలు సంపూర్ణ మద్దతు తెలపడం వెనుక లచ్చిరెడ్డి ఉన్నారనేది ఉద్యోగ వర్గాల్లో టాక్.


ఇది కూడా చదవండి: Lakshmi Narayana Raja Yoga: లక్ష్మీ నారాయణ రాజయోగం ఏర్పాటు.. ఈ రాశుల వారు కుబేరులు కాబోతున్నారు..


ఇది ఇలా ఉండగానే లచ్చిరెడ్డి మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. వరద సహాయ నిధి కింద రాష్ట్ర ప్రభుత్వానికి ఒక్క రోజు వేతనాన్ని ఇవ్వాలని లచ్చిరెడ్డి ఉద్యోగులకు పిలుపునిచ్చాడు. అంతే కాదు సుమారు 130 కోట్ల సహాయ నిధిని రేవంత్ రెడ్డికి చెక్ ను ఉద్యోగులు అందించారు. ఇలా ఉద్యోగుల విషయంలో లచ్చిరెడ్డి తన మార్క్ ను చాటుకుంటున్నాడు. ఇదంతా చూసిన వాళ్లు లచ్చిరెడ్డికి గత ప్రభుత్వంలో తనకు జరిగిన పరాభవాన్ని సవాల్ గా తీసుకొని ఇందంతా చేస్తున్నట్లు  ఉద్యోగ వర్గాల్లో గుస గుసలు వినపడుతున్నాయి. గతంలో ఉన్న కొన్ని సంఘాల అధ్యక్షుల మాదరిగా కాకుండా తన అందరినీ కలుపుపోవాలని లచ్చిరెడ్డి అనుకుంటున్నారట. ఉద్యోగుల విషయంలో మాత్రం కాంప్రమేజ్ అయ్యేదీ లేదని అంటున్నారట. అంతే కాదు గతంలో లోగా కాకుండా ఇప్పుడు ముఖ్యమంత్రి అందుబాటులో ఉన్నారని మన సమస్యలను చెప్పుకునే అవకాశం ఉందని కూడా లచ్చిరెడ్డి తోటి ఉద్యోగులకు చెబుతున్నారట.ఇక భవిష్యత్తులో లచ్చిరెడ్డి మరింత కీలకం అవుతారనేది ఉద్యోగ వర్గాల్లో టాక్. మరోవైపు లచ్చిరెడ్డి ఇదంతా భవిష్యత్తులో  పొలిటికల్ ఎంట్రీ ఇవ్వడానికి సిద్దపడుతున్నారని అందులో బాగంగానే ఉద్యోగుల సంఘాల తరుపున ప్రభుత్వానికి పూర్తిగా సహకరిస్తున్నారనేది  మరో వర్గం చర్చించుకుంటుంది.


మొత్తానికి గత ప్రభుత్వంలో సైలెంట్ గా ఉన్న లచ్చిరెడ్డి ఇప్పుడు యమ జోరు మీద ఉన్నాడు. ఉద్యోగ సంఘాల జేఏసీ ఛైర్మన్ గా ఉంటూనే ప్రభుత్వ నిర్ణయాలకు మద్దతు తెలుపుతున్నారు. లచ్చిరెడ్డి ఉద్యోగ సంఘాల తరుపున ప్రతినిధిగానే ఉంటారా లేక భవిష్యత్తులో పొలిటికల్ ఎంట్రీ ఇస్తారా అనేది మాత్రం వేచి చూడాలి.


ఇది కూడా చదవండి: Lakshmi Narayana Raja Yoga: లక్ష్మీ నారాయణ రాజయోగం ఏర్పాటు.. ఈ రాశుల వారు కుబేరులు కాబోతున్నారు..


ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.