Telangana: ఎంట్రన్స్ టెస్టుల నిర్వహణపై కీలక నిర్ణయం
తెలంగాణలో కరోనా (Coronavirus) వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో పలు ప్రవేశ పరీక్షల నిర్వహణ (entrance tests), 2020-21 విద్యా సంవత్సరం ప్రారంభంపై రాష్ట్ర పభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది.
Entrance Exams: హైదరాబాద్: తెలంగాణలో కరోనా (Coronavirus) వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో పలు ప్రవేశ పరీక్షల నిర్వహణ (entrance exams), 2020-21 విద్యా సంవత్సరం ప్రారంభంపై రాష్ట్ర పభుత్వం ( TS Govt ) కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ మేరకు విద్యాశాఖ ఉన్నతాధికారులు, ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డితో సోమవారం తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ( sabitha indra reddy ) సమీక్ష నిర్వహించారు. ఈ నెల 17 నుంచి ఇంటర్ విద్యార్థులకు ఆన్‌లైన్ తరగతులు ప్రారంభిస్తామని, సెప్టెంబరు 1 తరువాత ఇంటర్ ప్రవేశాలకు అనుమతిస్తామని మంత్రి సబిత తెలిపారు. అదేవిధంగా 20వ తేదీ తరువాత ప్రభుత్వ పాఠశాలల్లో 6 నుంచి 10వ తరగతి చదివే విద్యార్థులకు టీశాట్, దూరదర్శన్ ద్వారా డిజిటల్ తరగతులు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. 3నుంచి 5వ తరగతి చదివే విద్యార్థులకు సెప్టెంబర్ 1వ తేదీ నుంచి డిజిటల్ తరగతులు ప్రారంభించాలని నిర్ణయించినట్లు తెలిపారు. Also read: Covid-19: సెప్టెంబరు 30 వరకు రైళ్లు బంద్
ఇదిలాఉంటే.. ఈ నెల 31న ఈ-సెట్ నిర్వహణ, సెప్టెంబరు 2న పాలిసెట్, సెప్టెంబరు 9,10,11,14వ తేదీల్లో ఎంసెట్ ఇంజినీరింగ్ పరీక్షలు నిర్వహించేందుకు యోచిస్తున్నట్లు తెలిపారు. హైకోర్టు అనుమతితో ఎంసెట్ నిర్వహించాల్సి ఉంటుందని పాపిరెడ్డి ఈ సందర్భంగా స్పష్టంచేశారు. Also read: Gujarat: మాస్క్ ధరించకపోతే రూ.1000 ఫైన్