రాజకీయ చర్చల్లో ఉద్ధండుడిగా, చరిత్రను తేదీలతో సహా చెప్పగలిగే రాజకీయ నేత అతను. మాజీ ఎమ్మెల్యేగా, ఆర్టీసీ మాజీ ఛైర్మన్ గా అందరికీ సుపరిచితులే. ఇప్పుడు  పచ్చళ్ల వ్యాపారంలో దిగారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


పచ్చళ్లు, పిండివంటల వ్యాపారం క్లిక్ అవ్వాలే గానీ..మంచి లాభాలు ఆర్జించి పెట్టగలదు. అందుకే ఆ మాజీ ఎమ్మెల్యే ఈ వ్యాపారాన్ని ఎంచుకున్నారు. మాజీ ఎమ్మెల్యేగా పింఛన్ తప్ప మరో ఆదాయం లేకపోవడంతో పచ్చళ్లు, పిండివంటల తయారీ వ్యాపారంలో అడుగెట్టారు. నిన్న మొన్నటి వరకూ రాజకీయాల్లో తిరిగిన గోనె ప్రకాశరావు ఈ వ్యాపారంలో అడుగుపెట్టడం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. 


తెలంగాణ రాష్ట్రవాసి అయినా ఆంధ్రప్రదేశ్ లో కూడా సుపరిచితమైన నేత. రాష్ట్ర విభజన తర్వాత రాజకీయాలకు దూరమైనా విశ్లేషకుడిగా మారి కొత్త ప్రయాణం ప్రారంభించారు. టీవీ చర్చల్లో అనర్గళమైన వ్యాఖ్యలతో, తేదీలతో సహా చరిత్రను చెప్పగలిగే సామర్ధ్యంతో ప్రత్యర్ధుల నోరు మూయించేవారు. సమాచార హక్కు చట్టం కింద పిటిషన్లు సంధించి ప్రభుత్వాలను, అధికారులను పరుగులు పెట్టించారు. చెమటలు పట్టించారు.


ఇప్పుడు ఆర్ధిక ఆసరా కోసం కొత్త వ్యాపారం ప్రారంభించారు. పచ్చళ్లు, పిండివంటల వ్యాపారంలోకి దిగడమే కాకుండా...వాటిని విదేశాలకు ఎగుమతి చేసేందుకు కొరియర్‌ సర్వీస్‌ కూడా పెట్టారు. ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యేగా పింఛన్‌ తప్ప గోనె ప్రకాష్‌రావుకు మరో ఆదాయం లేదు. చండ్ర రాజేశ్వరరావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో నడుస్తున్న వృద్ధాశ్రమంలో కొన్నాళ్లు ఉన్న గోనె ప్రకాశరావు...ఇప్పుడు సొంతం వ్యాపారం మొదలెట్టారు. Also read: CPGET 2020 Application Last Date: సీపీజీఈటీ 2020 దరఖాస్తుల తుది గడువు పొడిగింపు