TS Eamcet 2023, ICET 2023 and Edcet 2023 Exam Dates Released: తెలంగాణ రాష్ట్రంలో ఎంసెట్‌ (Eamcet 2023) పరీక్షల తేదీలను రాష్ట్ర ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. మే 7 నుంచి 14 వరకు ఎంసెట్‌ పరీక్ష నిర్వహించనున్నారు. మే 7 నుంచి 11 వరకు ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ పరీక్ష.. మే 12 నుంచి 14 వరకు ఎంసెట్‌ అగ్రికల్చర్‌ మరియు ఫార్మా పరీక్ష జరగనుంది. ఎంసెట్‌ 2023తో సహా తెలంగాణ రాష్ట్రంలో ఇతర ప్రవేశ పరీక్షల తేదీలను కూడా ఉన్నత విద్యామండలి ఖరారు చేసింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మే 18న (TS Edcet 2023) ఎడ్‌సెట్‌ 2023 పరీక్ష నిర్వహిస్తున్నట్లు ఉన్నత విద్యామండలి తెలిపింది. మే 20న (TS Ecet 2023) ఈసెట్‌ 2023.. మే 25న (TS LAWCET 2023) లాసెట్‌ 2023, పీజీ ఎల్‌సెట్‌ 2023.. మే 26, 27న (TS ICET 2023) ఐసెట్‌ 2023.. మే 29 నుంచి జూన్‌ 1 వరకు (TS PGECET 2023) పీజీ ఈసెట్‌ 2023 పరీక్షలు నిర్వహించనున్నట్టు ఉన్నత విద్యామండలి ఓ ప్రకటనలో పేర్కొంది. 


పరీక్ష తేదీలు: 
# మే 7 నుంచి 11 వరకు ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ పరీక్ష
# మే 12 నుంచి 14 వరకు ఎంసెట్‌ అగ్రికల్చర్‌, ఫార్మా పరీక్ష
# మే 18న ఎడ్‌సెట్‌ 2023 పరీక్ష
# మే 20న ఈసెట్‌ 2023 పరీక్ష
# మే 25న లాసెట్‌ 2023 పరీక్ష, పీజీ ఎల్‌సెట్‌ 2023 పరీక్ష
# మే 26, 27న ఐసెట్‌ 2023 పరీక్ష
# మే 29 నుంచి జూన్‌ 1 వరకు పీజీ ఈసెట్‌ 2023 పరీక్షలు


Also Read: Turkey Syria Earthquake: టర్కీ, సిరియాలో పెరుగుతున్న మృతుల సంఖ్య.. 5 వేలకు పైనే మరణాలు!  


Also Read: Virat Kohli Lost Phone: ఫోన్ పోగొట్టుకున్న విరాట్ కోహ్లీ.. అనుష్క ఫోన్ నుంచి ఆర్డర్ చేయమన్న జొమాటో!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.