Zomato trolls Virat Kohli after India Batter lost new phone: భారత్, ఆస్ట్రేలియా మధ్య బోర్డర్-గవాస్కర్ 2023 ట్రోఫీ మరో రెండు రోజుల్లో ప్రారంభం అవుతుంది. 4 టెస్టుల సిరీస్‌లోని మొదటి టెస్ట్ నాగపూర్ వేదికగా గురువారం (ఫిబ్రవరి 9) నుంచి ప్రారంభం కానుంది. ఈ టెస్టులో విజయం సాదించేందుకు ఇరు జట్లు ముమ్మరంగా సాధన చేస్తున్నాయి. సాధారణంగా భారత్ పిచ్‌లు స్పిన్‌కు అనుకూలం కాబట్టి స్పిన్నర్ల బౌలింగ్‌లో ఇరు జట్ల బ్యాటర్లు ప్రాక్టీస్ చేస్తున్నారు. టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ కూడా స్పిన్‌లో చమటోడ్చుతున్నాడు. అయితే కోహ్లీ ఫోన్‌కు సంబందించిన ఓ న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది.
భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ తన మొబైల్ ఫోన్‌ను పోగొట్టుకొన్నాడట. అయితే విరాట్ పోగొట్టుకుంది కొత్త మొబైల్. ఫోన్‌ను పోగొట్టుకొన్న విషయం తన ట్విటర్ ద్వారా తెలుపుతూ.. ఆవేదన వ్యక్తం పెట్టాడు. 'బాక్స్‌లో నుంచి బయటకు కూడా తీయని ఫోన్ పోతే అంతకంటే బాధాకరమైన ఫీలింగ్ ఇంకొకటి ఉండదు. ఎవరైనా నా ఫోన్ చూశారా?' అని కోహ్లీ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ సోషల్ మీడియాలో నిమిషాల వ్యవధిలో వైరల్‌గా మారింది. ఈ ట్వీటుకు నెట్టింట కామెంట్ల వర్షం కురుస్తోంది. 'అయ్యో పాపం విరాట్ కోహ్లీ' అని కొందరు కామెంట్స్ చేయగా.. 'పైసల్ ఎమన్నా తక్కువగా ఉన్నాయా.. ఇంకొకటి కొంటాడు' అని మరికొందరు ట్వీట్ చేశారు.
విరాట్ కోహ్లీ ట్వీటుపై ఫుడ్ డెలివరీ యాప్ 'జొమాటో' మాత్రం చాలా హాస్యపదంగా స్పందించింది. 'వదిన గారి ఫోన్ నుంచి ఐస్ క్రీమ్‌ను ఆర్డర్ చేసేందుకు ఏమాత్రం మొహమాటం పడొద్దు. ఇప్పుడు అదే మీకు ఉపయోగంగా ఉంటుంది' అని జొమాటో కామెంట్ పెట్టింది. అయితే విరాట్ కోహ్లీ మొబైల్ నిజంగా పోయిందా లేదా ఏదైనా యాడ్ కోసం అలా ట్వీట్ చేసారా? అన్నది తెలియాల్సి ఉంది. యాడ్ అయితే మరికొన్ని రోజుల్లో తెలిసిపోనుంది.
ప్రస్తుతం విరాట్ కోహ్లీ ఆస్ట్రేలియాతో నాలుగు టెస్టుల సిరీస్ కోసం నాగపూర్‌లో ఉన్నాడు. న్యూజీలాండ్ టీ20 సిరీస్ నుంచి విశ్రాంతి తీసుకున్న కోహ్లీ.. మొన్నటివరకు కుటుంబంతో సరదాగా గడిపాడు. ఆస్ట్రేలియాపై మంచి రికార్డు ఉన్న కోహ్లీ.. తనదైన ఆటతీరుతో మరోసారి ఆధిక్యం సాధించాలని చూస్తున్నాడు. ఇక తొలి టెస్ట్‌లో 64 పరుగులు చేస్తే.. అంతర్జాతీయ క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్లలో అత్యంత వేగంగా 25 వేల పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా కోహ్లీ రికార్డుల్లోకి ఎక్కుతాడు.
Also Read: రూ. 26 లక్షలకే టయోటా ఫార్చ్యూనర్.. రోడ్ టాక్స్ కూడా చెల్లించాల్సిన అవసరం లేదు!
Also Read: Infosys Fresher Employees: శిక్షణ అనంతరం.. 600 మంది ఉద్యోగులను తొలగించిన ఇన్ఫోసిస్!
లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.