Drones in Agriculture: తెలంగాణలో వ్యవసాయ రంగాన్ని కొత్త పుంతలు తొక్కించేందుకు ఆధునీకీకరణపై దృష్టి సారించింది టీఆర్ఎస్ సర్కార్. రైతులకు సబ్సిడీపై యంత్రాలను సప్లై చేయడం ద్వారా వ్యవసాయ రంగంలో యాంత్రీకరణకు ప్రాధాన్యమిస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటివరకూ ట్రాక్టర్లు, హార్వెస్టర్స్, రొటావేటర్లు తదితర యంత్రాలను సబ్సిడీపై అందజేస్తోంది. ఈ క్రమంలో త్వరలోనే రైతులకు డ్రోన్లు కూడా సప్లై చేయాలని నిర్ణయించింది. వ్యవసాయ రంగంలో డ్రోన్ల ప్రవేశం విప్లవాత్మక మార్పులను తీసుకొస్తుందని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ ఏడాది బడ్జెట్‌లో వ్యవసాయ రంగ యాంత్రీకరణ కోసం పెట్టిన రూ.500 కోట్లు నిధులను ఇందుకోసం వెచ్చించే అవకాశం ఉంది. త్వరలో డ్రోన్ల పంపిణీపై అధికారిక ప్రకటన రావొచ్చు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వ్యవసాయంలో డ్రోన్ల ఉపయోగం :


పంట పొలాల్లో రైతులే స్వయంగా పురుగు మందులను స్ప్రే చేయడం వల్ల ఆరోగ్య సమస్యల బారినపడుతున్నారు. ఈ పని డ్రోన్ల ద్వారా చేసినట్లయితే వేగంగా పని పూర్తవడంతో పాటు రైతుల ఆరోగ్యంపై ఎటువంటి దుష్ప్రభావం పడకుండా ఉంటుంది. కాబట్టి వ్యవసాయ రంగంలో మందుల పిచికారీ కోసం డ్రోన్లను ఉపయోగించే అవకాశం ఉంది.


డ్రోన్లకు అమర్చే కెమెరా ద్వారా పంటలను ఫోటో తీయడం, చీడపీడలను గుర్తించడం కూడా చేయవచ్చు. తక్కువ సమయంలో ఎక్కువ విస్తీర్ణంలోని పొలాలను ఫోటోలు తీయడం ద్వారా చీడపీడలు సోకాయా లేదా అనేది సులువుగా గుర్తించవచ్చు. ఆ ఫోటోలను సంబంధిత వ్యవసాయాధికారిక పంపడం ద్వారా చీడపీడల తెగులును త్వరగా అరికట్టవచ్చు.


పంట ఎదుగుదల, చీడపీడలు తదితర అంశాలన్నింటినీ డ్రోన్ల ద్వారా క్షుణ్ణంగా పరిశీలించే అవకాశం ఉంటుంది.


డ్రోన్లను ఎవరికి అందజేస్తారు :


డ్రోన్లను రైతులకు అందజేయాలని నిర్ణయించినప్పటికీ ఇందుకోసం కొన్ని నిబంధనలు అమలుచేసే అవకాశం ఉంది. పదో తరగతి ఉత్తీర్ణులై, డ్రోన్ ఆపరేషన్‌పై శిక్షణ తీసుకున్న రైతులకు వీటిని అందజేస్తారు. అయితే ప్రభుత్వం రైతులకు దీనిపై శిక్షణ ఇస్తుందా లేదా రైతులే ఆ శిక్షణ తీసుకోవాల్సి ఉంటుందా అనేది ఇంకా స్పష్టత లేదు. సాధారణంగా ఒక్కో డ్రోన్ ధర రూ.10 లక్షల వరకు ఉంటుందని అంచనా వేశారు. ఈ నేపథ్యంలో రైతు సంఘాలకు వీటిని సబ్సిడీపై అందించడం ద్వారా గ్రామంలోని రైతులందరికీ ఉపయోగకరంగా ఉంటుందని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే డ్రోన్లపై ఎంతమేర సబ్సిడీ ఇస్తారనే విషయంలో ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.


Also Read: Horoscope Today July 20th: నేటి రాశి ఫలాలు.. ఈ రాశుల వారు కష్టానికి తగిన ప్రతిఫలం పొందుతారు..


Also Read: Gold Price Today: పెరిగిన పసిడి ధర.. హైదరాబాద్ సహా దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి బంగారం ధరలివే..



 


స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook