Telangana Formation Day: నేడు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం.. స్వరాష్ట్ర కల సాకారమై ఎనిమిది వసంతాలు పూర్తి...
Telangana Formation Day : నేడు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం. దశాబ్దాల తెలంగాణ ప్రజల కల సాకారమైన రోజు. త్యాగాల పునాదిగా అలుపెరగని ఉద్యమంతో తెలంగాణ ప్రజలు స్వరాష్ట్రాన్ని సాధించుకున్న రోజు.
Telangana Formation Day : నేడు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం. దశాబ్దాల తెలంగాణ ప్రజల కల సాకారమైన రోజు. త్యాగాల పునాదిగా అలుపెరగని ఉద్యమంతో తెలంగాణ ప్రజలు స్వరాష్ట్రాన్ని సాధించుకున్న రోజు. ఆత్మగౌరవం, అస్థిత్వం ప్రాతిపదికన దోపిడీ, వివక్ష, అణచివేత, అసమానతలపై తెలంగాణ సమాజం చేసిన పోరాటం ప్రపంచ చరిత్రలో నిలిచిపోతుందనడంలో అతిశయోక్తి లేదు. 1960వ దశకంలో మొదలైన తెలంగాణ ఉద్యమం 2014, జూన్ 2న గమ్యాన్ని ముద్దాడింది. నేటితో స్వరాష్ట్ర కల సాకారమై ఎనిమిది వసంతాలు పూర్తయ్యాయి.
తొలి దశ ఉద్యమం :
పెద్ద మనుషుల ఒప్పందంతో 1956, నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అవతరించింది. అయితే ఆంధ్రప్రదేశ్ అవతరించిన తర్వాత పెద్ద మనుషుల ఒప్పందాన్ని తుంగలో తొక్కారు. ముల్కీ నిబంధనలు అమలుకాకపోవడంతో తెలంగాణ ప్రజానీకానికి తీవ్ర అన్యాయం జరిగింది. దీంతో 1968లో విద్యార్థులు, ఉద్యోగులు తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై పెద్ద ఎత్తున పోరాడారు. అప్పటి ఉద్యమంలో మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ప్రజా సమితి కీలక పాత్ర పోషించింది. తొలి దశ ఉద్యమంలోనే దాదాపు 400 మంది అమరులయ్యారు.
మలి దశ తెలంగాణ ఉద్యమం :
తెలంగాణలో మలి దశ ఉద్యమం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సారథ్యంలో టీఆర్ఎస్ పార్టీ స్థాపన తర్వాత క్రమంగా ఉవ్వెత్తున ప్రజ్వలించింది. కేసీఆర్ కన్నా ముందే మారోజు వీరన్న లాంటి విప్లవ శక్తులు ప్రత్యేక తెలంగాణ సాధన దిశగా ఉద్యమించారు. 2001లో టీఆర్ఎస్ పార్టీ స్థాపన తర్వాత తెలంగాణ భావజాలాన్ని నలువైపులా వ్యాపింపజేశారు. ప్రొఫెసర్ జయశంకర్ సిద్ధాంతకర్తగా... కేసీఆర్ 'తెలంగాణ సాధన' అనే సింగిల్ పాయింట్ ఎజెండాతో తెలంగాణ సాధనకు కృషి చేశారు. నీళ్లు-నిధులు-నియామకాలు అనే నినాదాన్ని విస్తృతంగా జనంలోకి తీసుకెళ్లారు.
ఓవైపు ప్రజలను ఉద్యమంలో మమేకం చేస్తూనే... ఎన్నికలు, ఉపఎన్నికలతో తెలంగాణ ఏర్పాటుకు రాజకీయ ప్రాధాన్యత కల్పించారు. ఈ క్రమంలో నవంబర్ 29న కేసీఆర్ చేసిన ఆమరణ దీక్ష ఉద్యమంలో కీలకమైంది. కేసీఆర్ దీక్షతో రాష్ట్రంలో నెలకొన్న పరిణామాలతో తెలంగాణ ఏర్పాటుకు కేంద్రం దిగిరాక తప్పలేదు. ఆ తర్వాత కేంద్రం మళ్లీ వెనుకడుగు వేసినప్పటికీ... తెలంగాణ సమాజం మరోసారి పోరు బాట పట్టింది. ఈ క్రమంలో ఎంతోమంది యువకులు ప్రాణాలర్పించారు. సకల జనుల సమ్మె, మిలియన్ మార్చ్ లాంటి ఉద్యమ కార్యాచరణ ఢిల్లీకి సెగ తగిలేలా చేసింది. అనేక నాటకీయ పరిణామాల నడుమ తెలంగాణ బిల్లు ఫిబ్రవరి 18, ఫిబ్రవరి 20లో లోక్‌సభ, రాజ్యసభలో ఆమోదం పొందింది. మార్చి 2, 2014న దీనిపై అధికారికంగా గెజిట్ విడుదలైంది. ఫలితంగా దేశంలో 29వ రాష్ట్రంగా జూన్ 2, 2014న తెలంగాణ ఏర్పాటైంది.
Also Read: Gold Price Today: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్... తగ్గిన బంగారం ధరలు.. ఏయే నగరాల్లో ఎంత ధరంటే..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook