Governer Tamilsai: తెలంగాణ గవర్నర్ గా తమిళి సై సౌందరరాజన్ మూడేళ్లు పూర్తి చేసుకున్నారు. గవర్నర్ వచ్చిన మొదట్లో తెలంగాణ ప్రభుత్వం ఆమెతో సఖ్యతగానే ఉంది. రోజుల తర్వాత సీన్ మారిపోయింది. గత ఏడాదిగా రాజ్ భవన్, తెలంగాణ సర్కార్ మధ్య చాలా గ్యాప్ వచ్చింది. సీఎం కేసీఆర్ రాజభవన్ వైపు కన్నెత్తి చూడటం లేదు. 9 నెలల తర్వాత గత నెలలో హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్రమాణస్వీకారోత్సవానికి రాజ్ భవన్ వచ్చారు సీఎం కేసీఆర్. ఆ రోజున గవర్నర్ తో సరదాగా ఉన్నారు. దీంతో ఇద్దరి మధ్య విభేదాలు సమసిపోయాయని అంతా భావించారు. కాని తర్వాత కూడా గ్యాప్ అలాగే కంటిన్యూ అవుతోంది. ఎప్పటిలానే తెలంగాణ సర్కార్, గవర్నర్ మధ్య వార్ కొనసాగుతోంది. ప్రభుత్వం తనను అవమానిస్తోందని ఓపెన్ గానే ప్రకటనలు చేశారు గవర్నర్. ఇలాంటి పరిస్థితుల్లోనే తెలంగాణ గవర్నర్ గా మూడేళ్లు పూర్తి చేసుకున్నారు తమిళి సై.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మూడేళ్లు పూర్తైన సందర్భంగా రాజ్ భవన్ లో మీడియాతో మాట్లాడారు గవర్నర్ తమిళి సై. ఈ సందర్భంగా మరోసారి ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు.  తెలంగాణ ప్రజలకు మంచి చేసే క్రమంలో అనేక ఇబ్బందులను ఎదురుకోవాల్సి వచ్చిందన్నారు. తనది ఎవరికి భయపడే స్వభావం కాదన్న తమిళి సై... తనను ఎవరూ తక్కువగా చేసి చూసినా సహించనని చెప్పారు. గవర్నర్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కనీస ప్రోటోకాల్ పాటించడం లేదని ఆరోపించారు. ఇది అనేక సందర్భాల్లో బయట పడిందన్నారు.ప్రభుత్వం చాలాసార్లు కావాలని ఇబ్బంది పెట్టినా  తాను భయపడలేదని గవర్నర్ తమిళి సై తెలిపారు. తనపై ఎందుకిలా వ్యవహరిస్తున్నారో అర్ధం కావడం లేదన్నారు. 


గవర్నర్ కార్యాలయానికి ప్రభుత్వం గౌరవం ఇవ్వడం లేదని ఆరోపించారు. గవర్నర్ కార్యాలయం అయిన రాజ్ భవన్ పై ప్రభుత్వం వివక్ష కొనసాగుతోందని అన్నారు. ప్రభుత్వం ప్రోటోకాల్ ను తుంగలో తొక్కిందన్నారు. గవర్నర్ ప్రసంగం లేకుండానే అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయని అన్నారు.రాష్ట్ర ప్రభుత్వానికి తనతో వచ్చిన ఇబ్బంది ఎంటో తెలియదన్నారు తమిళి సై. .మహిళా గవర్నర్ గా తనను చాలా తక్కువ అంచనా వేశారని అన్నారు. ఒక మహిళగా , మహిళా గవర్నర్ గా పురుషుల కంటే ఎక్కువగా కష్టపడి పని చేయగలనని చెప్పార. .సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా ప్రభుత్వాన్ని హెలీ క్యాప్టర్ అడిగితే ఇవ్వలేదని వివరించారు. చివరి క్షణం వరకు రాష్ట్ర ప్రభుత్వం తనకు ఎలాంటి ఏర్పాట్లు చేయలేదన్నారు. అయినా దాదాపు నాలుగు గంటల పాటు రోడ్డు మార్గంలో ప్రయాణం చేసి సమ్మక్క సారలమ్మ దగ్గరకు చేరానని చెప్పారు తమిళి సై.  ఎట్ హోం కార్యక్రమానికి సీఎం కేసీఆర్ వస్తానని రాకపోవడం కరెక్టేనా అని తమిళి సై ప్రశ్నించారు. వాస్తవాలు ఏమిటో ప్రజలకు తెలియాల్సి ఉందన్నారు. 


తనకు ఎవరిపైనా వ్యక్తిగతంగా కోపం లేదని.. విద్యార్థుల ఇబ్బందులు తెలుసుకోవడానికే యూనివర్శిటీలకు వెళ్లానన్నారు. తాను వరద ప్రాంతాలలో తిరగడం వల్లే కొందరు అక్కడికి వచ్చారంటూ పరోక్షంగా సీఎం కేసీఆర్ ను ఉద్దేశించి కామెంట్ చేశారు తమిళిసై సౌందరరాజన్. తన పరిధి ఏంటో తనకు తెలుసని చెప్పారు. రాజ్ భవన్ ను ప్రజాభవన్ గా మార్చానని, ప్రజల కోసం రాజ్ భవన్ తలుపులు తెరిచి పెట్టామని తమిళిసై చెప్పారు వరదల సమయంలో రెడ్ క్రాస్ ద్వారా సహాయక కార్యక్రమాలు చేపట్టామని వెల్లడించారు. మహిళను అవమానించారన్నది తెలంగాణ చరిత్రలో ఉండకూడదని తన అభిప్రాయమని గవర్నర్ తమిళిసై వెల్లడించారు. 


Also Read:  AP CABINET: కేబినేట్ లో మార్పుల దిశగా సీఎం జగన్.. వేటు పడే మంత్రులు వీళ్లేనా? 


Also Read: పాకిస్తాన్ అభిమానులను చితకబాదిన అఫ్గానిస్థాన్‌ ఫాన్స్.. టీమిండియా ఫాన్స్ ఫుల్ ఖుషి!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి