Shabbir Ali: దేశంలో వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టం అమల్లోకి వచ్చింది. కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. కాంగ్రెస్ సహా చాలా వరకూ ప్రతిపక్షాలు సీఏఏ అమలును వ్యతిరేకిస్తున్నాయి. సీఏఏతో నష్టాలున్నాయని విమర్శలు చేస్తున్నారు. కానీ తెలంగాణ కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ మాత్రం తెలిసో తెలియకో సీఏఏను సమర్ధిస్తూ మాట్లాడటం చర్చనీయాంశంగా మారింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దేశంలో వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టం సీఏఏ వల్ల ముస్లింలకు ఎలాంటి నష్టం లేదని సాక్షాత్తూ కాంగ్రెస్ నేత, తెలంగాణ ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీ స్పష్టం చేశారు. పౌరసత్వ సవరణ చట్టం గురించి ముస్లింలు భయపడాల్సిన అవసరం లేదన్నారు. చట్టంపై నమ్మకమందని, న్యాయపరంగా ఎదుర్కొందామని తెలిపారు. కానీ సీఏఏతో నష్టం లేదని చెప్పడం మాత్రం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. 


తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్ధితో వెనుకబడిన వర్గాల అభివృద్ధి కోసం పనిచేస్తోందని షబ్బీర్ అలీ తెలిపారు. బీసీల కోసం కొత్త కార్పొరేషన్లు ఏర్పాటు చేసి, నిధులు సమకూర్చిందన్నారు. పదేళ్లుగా వెనుకబడిన వర్గాల కులాలు కార్పొరేషన్ల కసం అడుగుతున్నారని షబ్బీర్ అలీ చెప్పారు. రాష్ట్రంలో అమిత్ షా పర్యటనపై స్పందించారు. అమిత్ షా కబుర్లు చెప్పడం తప్ప చేసేదేం లేదని విమర్శించారు. గత ప్రభుత్వ హయాంలో అవినీతి జరిగిందని చెబుతున్న మోదీ, అమిత్ షాలు విచారణకు ఎందుకు ఆదేశించడం లేదని ప్రశ్నించారు. 


అటు కేసీఆర్‌పై కూడా షబ్బీర్ అలీ విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉపయోగించి బాషపై వస్తున్న విమర్శలకు షబ్బీర్ అలీ సమాధానం చెప్పారు. కేసీఆర్ భాష వల్లే తెలంగాణ ప్రాంతం బద్నాం అయిందని మండిపడ్డారు. సాటి ప్రజా ప్రతినిధుల్ని కేసీఆర్ అసభ్యంగా మాట్లాడినప్పుడు భాష గుర్తుకురాలేదా అని నిలదీశారు. 


Also read: Telangana Vehicle Registration: రాష్ట్రంలో వాహనాలకు కొత్త రిజిస్ట్రేషన్ TG సిరీస్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook