Srisailam fire accident: మృతుల కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా, ఉద్యోగం
శ్రీశైలం అగ్నిప్రమాద ( Srisailam Fire Accident ) మృతులకు తెలంగాణ ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. ప్రమాదంలో మృతి చెందిన డీఈ కుటుంబానికి 50 లక్షలు..మిగిలినవారికి 25 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ఇస్తున్నట్టు తెలంగాణ ప్రభుత్వం ( Telangana government ) వెల్లడించింది.

శ్రీశైలం లెఫ్ట్ కెనాల్ లో ఉన్న భూగర్భ జలవిద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో జరిగిన అగ్నిప్రమాదంలో 9 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. మృతుల్లో డీఈ ఒకరు, నలుగురు ఏఈలు, మిగిలిన సిబ్బంది ఉన్నారు. మృతుల కుటుంబాల్ని అన్ని రకాలుగా ఆదుకుంటామని చెప్పిన తెలంగాణ ప్రభుత్వం ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. ప్రమాదంలో మృతి చెందిన డీఈ శ్రీనివాస్ కుటుంబానికి 50 లక్షల రూపాయల్ని, ఏఈలతో పాటు మిగిలిన సిబ్బందికి 25 లక్షల రూపాయలు ఇవ్వనున్నట్టు కేసీఆర్ ప్రభుత్వం వెల్లడించింది. అదే విధంగా మృతుల కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం కల్పిస్తామని హామీ ఇచ్చింది. ప్రమాదం అనంతరం ఉన్నతస్థాయి అధికార్లతో జరిపిన అత్యవసర సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఈ ఘటనలో సొరంగంలో చిక్కుకున్న 9 మంది మరణించగా..మరో 8 మంది సురక్షితంగా బయటపడ్డారు. మృతి చెందిన వారి వివరాలు ఇలా ఉన్నాయి. Also read: Harish Rao: ఆ ఘటన అత్యంత దురదృష్టకరం: హరీష్ రావు