హైదరాబాద్: గత కొన్ని రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జరుగుతున్న కృష్ణా జలాల అంశం రోజు రోజుకు ముదురుతోంది. దక్షిణ తెలంగాణ జిల్లాల్లో కాంగ్రెస్, బీజేపీ లు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టాయి. అయితే ఈ కృష్ణ జలాల వివాదం(krishna river water dispute) ఇప్పట్లో ముగిసేలా కనబడడం లేదు. కాగా ఇప్పటికే వివాదాస్పదమైన నేపథ్యంలో కృష్ణ జలాలపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. కృష్ణ జలాల వినియోగంపై కసరత్తు చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం జూరాల వద్ద మరో (Lift Irrigation) ఎత్తిపోతల పథకం ప్రాజెక్టు నిర్మాణానికి సన్నాహాలు ఏర్పాటు కాబోతున్నాయని, ఈ ప్రాజెక్టు సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. జూరాల ప్రాజెక్టు సమీపంలో 15 నుంచి 20 టీఎంసీల సామర్థ్యం కలిగిన రిజర్వాయర్ నిర్మాణంపై తెలంగాణ సర్కారు నివేదిక కోరింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: కరోనా పోరాటయోధులకు సంఘీభావంగా పాట పాడిన ఆశాభోంస్లే, ఇతర ప్రముఖ గాయని గాయకులు...


మరోవైపు నీటిపారుదల అంశాలపై తాజాగా జరుగుతున్న సమీక్షలో ఈ ప్రాజెక్టుపై చర్చించే అవకాశం ఉంది. ఇప్పటికే థరూర్ మండలం గూడెం దొడ్డి, ద్యాగాదొడ్డి గ్రామాల నడుమ కొత్త ప్రాజెక్టుకు అనువైన ప్రదేశం ఉన్నట్టు నీటిపారుదల శాఖ తన నివేదికలో పేర్కొంది. నూతన రిజర్వాయర్ నుంచి నెట్టంపాడు, భీమా-1, భీమా-2, కోయిల్ సాగర్ కు లింక్ ఏర్పాటు చేసి 30 రోజుల్లోనే 15 నుంచి 20 టీఎంసీలు ఎత్తిపోసేలా ప్రాజెక్టుకు రూపకల్పన చేసినట్టు తెలుస్తోంది. ప్రధానంగా ముంపు ప్రాంతాలు లేనివిధంగా భారీ రిజర్వాయర్ నిర్మించనున్నట్టు సూచన ప్రాయంగా తెలిపింది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..