కరోనా పోరాటయోధులకు సంఘీభావంగా పాట పాడిన ఆశాభోంస్లే, ఇతర ప్రముఖ గాయని గాయకులు...

ప్రపంచవ్యాప్తంగా మానవజాతిని అతలాకుతలం చేస్తోన్న కరోనా మహమ్మారి విజృంభణ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో 211 మంది భారత గాయని, గాయకులు కరోనాపై పోరాటంలో ప్రజల్ని రక్షించేందుకు వైద్య సిబ్బంది  

Last Updated : May 17, 2020, 04:15 PM IST
కరోనా పోరాటయోధులకు సంఘీభావంగా పాట పాడిన ఆశాభోంస్లే, ఇతర ప్రముఖ గాయని గాయకులు...

హైదరాబాద్: ప్రపంచవ్యాప్తంగా మానవజాతిని అతలాకుతలం చేస్తోన్న(Covid-19) కరోనా మహమ్మారి విజృంభణ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో 211 మంది భారత గాయని, గాయకులు కరోనాపై పోరాటంలో ప్రజల్ని రక్షించేందుకు వైద్య సిబ్బంది త్యాగాలు చేస్తూ విధుల్లో పాల్గొంటోన్న వారికి సంఘీభావంగా ఓ పాట పాడారు. వైద్యులు తమ ప్రాణాలకు ముప్పుందని తెలిసినా వారు విధులు నిర్వహిస్తున్నారని, వారితో పాటు కరోనా మహమ్మారి వ్యాప్తిని కట్టడి చేసే పోరులో పనిచేస్తోన్న వారికి సంఘీభావంగా ఈ పాట పాడారు.

Also Read:  ఏపీలో 25 కొత్త కేసులు..!

 

దేశవ్యాప్తంగా ఉన్న గాయని, గాయకులు 'జయతు జయతు భారతం'  గీతం కోసం అందరూ ఒక్క తాటిపైకి వచ్చి స్ఫూర్తిగా నిలిచారు. గాయకులు ఆశాభోంస్లే, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, హరిహరన్, కైలాశ్ ఖేర్, శంకర్ మహదేవన్, ఉదిత్ నారాయణ్ వంటి ప్రముఖులు ఎందరో ఇందులో పాల్గొన్నారు.

ఈ విపత్కర పరిస్థితుల్లో మొత్తం 14 భాషల్లో (హిందీ, బెంగాలీ, మరాఠీ, గుజరాతీ, తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, భోజ్‌పురి, అస్సామీ, కశ్మీరీ, సింధీ, రాజస్థానీ, ఒడియా భాషల్లో ఈ పాట ఉంది. ఈ క్లిష్ట సమయంలో కుటుంబంగా కలిసి నిలబడిన ప్రతి భారతీయుడికి సంఘీభావంగా 14 భాషల్లోని చారిత్రాత్మక గీతం అంకితం చేయబడిందని ప్రముఖ గాయని ఆశా భోంస్లే తెలిపారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Trending News