స్కూల్ విద్యార్ధులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ వినిపించింది. స్కూళ్లకు వేసవి సెలవులు పొడిగించారు. ఈ మేరకు తెలంంగాణ విద్యాశాఖ ప్రకటన విడుదల చేసింది. తాజా నిర్ణయంతో జూన్‌ 1 నుంచి పునఃప్రారంభం కావాల్సిన పాఠశాలలు .... జూన్‌ 12 నుంచి ప్రారంభం కానున్నాయి.


రాష్ట్రంలో ఎండల తీవ్రవ ఏమాత్రం తగ్గకపోవడం కారణంగా విద్యార్థులకు ఎండల వేడి నుంచి కాస్త ఉపశమనం కల్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్న విద్యాశాఖ ప్రకటించింది. జూన్ మొదటి వారం వరకు రాష్ట్రంలో ఎండల తీవ్రత కొనసాగుతుందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.