Holidays 2025: తెలంగాణ ప్రభుత్వం 2025 సెలవుల ప్రకటన.. 27 సాధారణ, 23 ఐచ్ఛిక సెలవులు ఎప్పుడంటే..?
Telangana Holidays 2025: వచ్చే ఏడాది 2025 కు సంబంధించిన సెలవును తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో 27 సాధారణ సెలవులు, 23 ఆప్షనల్ హాలిడేస్ రానున్నాయి. ఈ మేరకు తెలంగాణ సీఎస్ శాంతి కుమారి జీవో జారీ చేశారు. ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Telangana Holidays 2025: తెలంగాణ ప్రభుత్వం 2025 కు సంబంధించిన అన్ని పండుగలు, ఆదివారాలు, ఆప్షనల్ హాలిడేస్‌కు సంబంధించిన జీవో జారీ చేశారు. ఈ మేరకు సీఎస్ శాంతి కుమారీ ఆధ్వర్యంలో జీవో జారీ అయింది. ఇందులో ప్రతి ఆదివారం, శనివారం సెలవులు ఉంటాయి. 2025 జనవరి 1వ తేదీ పబ్లిక్ హాలిడే కాబట్టి ఫిబ్రవరిలో రెండో శనివారం ఆగష్టు 8వ తేదీ మాత్రం వర్కింగ్ డేగా ప్రకటించారు.
ఇదీ చదవండి: రైతులకు బిగ్ అలెర్ట్.. ఈ లిస్టులో మీ పేరు ఉంటే.. పీఎం కిసాన్ డబ్బులు రావు..! పూర్తి వివరాలు ఇవే..
ఇదీ చదవండి: త్వరపడండి బీఎస్ఎన్ఎల్ బంపర్ ఛాన్స్.. రూ.700 లోపే 100 రోజుల రీఛార్జ్ ప్లాన్..
2025 ప్రభుత్వ జనరల్ సెలవుల జాబితా..
2025 జనవరి 1 - న్యూ ఇయర్ (బుధవారం)
జనవరి 13 భోగి (సోమవారం)
జనవరి 14 సంక్రాంతి (మంగళవారం)
జనవరి 26 రిపబ్లిక్ డే (ఆదివారం)
2025 ఫిబ్రవరి 26 మహాశివరాత్రి (బుధవారం)
మార్చి 13 హోలీ (శుక్రవారం)
మార్చి 30 ఉగాది (ఆదివారం)
మార్చి 31 ఈద్ ఉల్ ఫితర్ (రంజాన్)(సోమవారం)
ఏప్రిల్ 1 (రంజాన్ సెలవు, మంగళవారం)
ఏప్రిల్ 6 శ్రీ రామనవమి (ఆదివారం)
ఏప్రిల్ 14 బీఆర్ అంబేడ్కర్ జయంతి (సోమవారం)
ఏప్రిల్ 18 గుడ్ ఫ్రైడే (శుక్రవారం)
జూన్ 7 బక్రిద్ (శనివారం)
జూలై 6 మొహర్రం (ఆదివారం)
జూలై 21 బోనాలు (సోమవారం)
ఆగష్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం (శుక్రవారం)
ఆగష్టు 18 శ్రీ కృష్ణ అష్టమి (శనివారం)
ఆగష్టు 27 వినాయక చవితి (బుధవారం)
సెప్టెంబర్ 5 ఈద్ మిలాద్ ఉన్ నబీ (శుక్రవారం)
సెప్టెంబర్ 21 బతుకమ్మ (ప్రారంభం)(ఆదివారం)
అక్టోబర్ 2 గాంధీ జయంతి, విజయ దశమి (గురువారం)
అక్టోబర్ 3 దసరా సెలవు (శుక్రవారం)
అక్టోబర్ 20 దీపావళి (సోమవారం)
నవంబర్ 5 గురునానక్ జయంతి, కార్తీక పౌర్ణమి (బుధవారం)
డిసెంబర్ 25 క్రిస్మస్ (గురువారం)
డిసెంబర్ 26 క్రిస్మస్ బాక్సింగ్ డే (శుక్రవారం)
ఈ సాధారణ సెలవుల్లో అన్ని ప్రభుత్వ రంగ స్కూళ్లు, కాలేజీలు, కార్యాలయాలకు సెలవులు ఉంటాయి. ఏవైనా పండుగల్లో మార్పు ఉంటే అంటే ముఖ్యంగా రంజాన్, మొహర్రం వంటివి చాంద్ చూపిన తర్వాత జరుపుకుంటారు కాబట్టి దాన్ని అనుసరించి మార్పు ఉంటుంది. దీన్ని ప్రభుత్వం ముందస్తుగా ప్రింట్ లేదా ఎలక్ట్రిక్ మీడియా ద్వారా ప్రకటిస్తుంది.
2025 ఆప్షనల్ సెలవుల జాబితాను కూడా ప్రభుత్వం ప్రకటించింది అవేంటో తెలుసుకుందాం..
2025 జనవరి 14 హజ్రత్ అలీ పుట్టినరోజు (ఈరోజు సంక్రాంతి సెలవు కూడా) (మంగళవారం)
జనవరి 15 కనుమ (బుధవారం)
జనవరి 28 షబ్ ఈ మేరజ్ (మంగళవారం)
ఫిబ్రవరి 3 శ్రీ పంచమి (సోమవారం)
ఏప్రిల్ 10 మహవీర్ జయంతి (గురువారం)
మే 12 బుద్ధ పౌర్ణమి (సోమవారం)
జూన్ 27 రథ యాత్ర (శుక్రవారం)
ఆగష్టు 8 వరలక్ష్మి వ్రతం (శుక్రవారం)
ఆగష్టు 9 రాఖీ పౌర్ణమి (శనివారం)
సెప్టెంబర్ 30 దుర్గ అష్టమి (మంగళవారం)
అక్టోబర్ 1 మహర్నవమి (బుధవారం)
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.