Telangana Coronavirus Update: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో సైతం అదే పరిస్థితి. ఈ నేపధ్యంలో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. మరోసారి లాక్‌డౌన్ విధిస్తారా అనే వార్తలు విన్పిస్తున్నాయి. నైట్‌కర్ఫ్యూ విధించవచ్చని తెలుస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దేశంలో కరోనా మహమ్మారి(Corona pandemic) మరోసారి పంజా విసురుతోంది. ఇటు తెలుగు రాష్ట్రాల్లో కూడా కరోనా కొత్త కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌తో పోలిస్తే తెలంగాణలో కేసుల సంఖ్య ఎక్కువగా ఉన్నట్టు సమాచారం. ఈ నేపధ్యంలో తెలంగాణ ప్రభుత్వం(Telangana government) అప్రమత్తమైంది. పాఠశాలల్ని మూసివేసేందుకు సన్నద్ధమవుతోంది. కేసుల సంఖ్య పెరగకుండా నియంత్రించేందుకు ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకునే అవకాశాలు స్పష్టంగా కన్పిస్తున్నాయి. పాక్షిక లాక్‌డౌన్ విధించాలా లేదా రాత్రిపూట లాక్‌డౌన్ విధించాలా అని ప్రభుత్వ వర్గాలు సమాలోచన చేస్తున్నట్టు సమాచారం. నైట్‌కర్ఫ్యూ ఆలోచన కూడా ఉన్నట్టుంది. 


ముఖ్యంగా సినిమా థియేటర్లు, జనాల రద్దీ ఉండే ప్రాంతాల్లో ఆంక్షలు విధించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. కరోనాపై త్వరలో సీఎం కేసీఆర్ (Cm Kcr) ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించి తగిన నిర్ణయం తీసుకుంటారనే ప్రచారం సాగుతోంది. తెలంగాణలో వీకెండ్స్‌లో లాక్‌డౌన్(Lockdown) విధించే అవకాశం కూడా ఉందని అధికారులు చెబుతున్నారు. వారంలో 3 రోజుల పాటు లాక్‌డౌన్ లేదా రాత్రిపూట కర్ఫ్యూ(Night Curfew)పై కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే దేశంలోని పలు నగరాల్లో లాక్‌డౌన్ దిశగా అడుగులు వేస్తున్నారు అధికారులు. రాష్ట్రంలో గత 24 గంటల్లో 394 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకూ నమోదైన కరోనా కేసుల సంఖ్య 3 లక్షల 3వేల 118కు చేరుకుంది. కాగా 2 లక్షల 98 వేల 645 మంది కోలుకున్నారు. జీహెచ్‌ఎంసీ (Ghmc) పరిధిలో కొత్తగా 81 మందికి కరోనా వైరస్ సోకింది. 


Also read: Telangana Mlc Elections: ప్రొఫెసర్లు ఓడారు..యజమానులు గెలిచారు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook