Telangana IAS Officers Transferred: తెలంగాణ పగ్గాలు చేపట్టినప్పటి నుంచి రేవంత్ తనదైన శైలీలో పాలనలో మార్కు చూపిస్తున్నారు. దీనిలో భాగంగా ప్రజలకు మంచి పాలన అందించే దిశగా అనేక చర్యలు చేపట్టారు. ఇప్పటికే  గత ప్రభుత్వంలో అవినీతికి పాల్పడిన అధికారులకు స్థానచలనం కల్పించారు. ఏళ్లుగా ఒకేచోట ఉండిపోయి.. పాలనను పట్టించుకుని అధికారులపై కొరడా ఝళిపించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ నేపథ్యంలో రేవంత్ సర్కారు మరో సంచలన నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో 44 మంది ఐఏఎస్ లను బదిలీ చేస్తు ప్రభుత్వం నిర్ణక్ష్ం తీసుకుంది.  ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) శాంతి కుమారీ ఉత్తర్వులు జారీ చేశారు.  గతంలో కూడా 20 మంది ఐఏఎస్ లను రేవంత్ సర్కారు ట్రాన్స్ ఫర్ చేసిన విషయం తెలిసిందే. 


 


ట్రాన్స్ ఫర్ అయిన అధికారులు, బాధ్యతలు..


 


జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్ ను ట్రాన్స్ కో సీఎండీగా,


సందీప్ కుమార్ సుల్తానియాను, ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రేటరీగా,


వాణి ప్రసాద్ ను టూరిజం, స్పోర్ట్స్ డైరెక్టర్ గా,


ఆమ్రాపాలీని జీహెచ్ఎంసీ కమిషనర్ గా,


శైలజా రామయ్యార్ ను దేవాదాయ కమిషనర్ గా


అశోక్ రెడ్డి జలమండలి ఎండీగా


అహ్మద్ నదీమ్ ను పర్యావరణం, అటవీ, సైన్స్ & టెక్నాలజీ డిపార్ట్‌మెంట్ కి 


సయ్యద్ అలీ ముర్తజా రిజ్వీ వాణిజ్య పన్నులు & ఎక్సైజ్ శాఖ కి బదలీ


సవ్యసాచి  ఘోష్  పశుసంవర్ధక శాఖ


సంజయ్ కుమార్ కార్మిక ఉపాధి ట్రైనింగ్ శాఖ, 


వాణి ప్రసాద్  యువజన సర్వీసులు, పర్యాటకం, క్రీడల ముఖ్య కార్యదర్శి


 శైలజా రామయ్యర్.. చేనెత, హస్తకళల ముఖ్య కార్యదర్శి, హ్యాండ్లూమ్స్ , టీజీసీవో హ్యాండ్ క్రాఫ్ట్స్ అదనపు బాధ్యతలు
 
అహ్మద్ నదీమ్ అటవీ, పర్యావరణంశాఖల ముఖ్యకార్యదర్శి, టీపీటీఆర్ఐ డీజీ అదనపు బాధ్యతలు..


 సుదర్శన్  రెడ్డిని  జీఏడీ ముఖ్య కార్యదర్శిగా నియమించింది.


అపూర్వ్ చౌహాన్ కూకట్ పల్లి జోనల్ నూతన కమిషనర్ గా


అభిలాష అభినవ్ నిర్మల్ జిల్లా కలెక్టర్ గా బదిలీపై వెళ్లారు.


Read more: Elephant Attacks On Mahout: మావటిని రెండుకాళ్లతో పిండి పిండి చేసిన ఏనుగు.. షాకింగ్ వీడియో వైరల్..


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి