Telangana Eamcet 2021: తెలంగాణ రాష్ట్ర ఎంసెట్ పరీక్షల షెడ్యూల్  విడుదలైంది. రాష్ట్ర సాంకేతిక విద్యామండలి విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం ఏ పరీక్షలు ఎప్పుడు జరగనున్నాయంటే..పరీక్ష సిలబస్ ఎలా ఉంటుందంటే.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తెలంగాణ ఎంసెట్ పరీక్షలు (Telangana Eamcet Exams) ఎప్పుడనేది ఖరారైంది. ఎంసెట్ పరీక్షల షెడ్యూల్‌ని రాష్ట్ర సాంకేతిక విద్యామండలి అధికారులు ఇవాళ విడుదల చేశారు. దీని ప్రకారం జూలై 5వ తేదీన అగ్రికల్చర్ పరీక్ష నిర్వహించనుండగా..జూలై 6వ తేదీన మెడికల్ ఎంట్రన్స్ పరీక్ష( Eamcet medical entrance) జరగనుంది. జూలై 7 నుంచి 9 వ తేదీ వరకూ అంటే మూడ్రోజుల పాటు ఇంజనీరింగ్ ఎంట్రన్స్ పరీక్షలు(Eamcet engineering entrance) జరగనున్నాయి. ఈ పరీక్షలకు సంబంధించిన అప్లికేషన్ల కోసం ఈనెల 18వ తేదీన నోటిఫికేషన్ వెలువడనుంది. ఫిబ్రవరి 20 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తారు. ఎంసెట్‌లో ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ నుంచి వంద శాతం, సెకండియర్‌ నుంచి 70 శాతం సిలబస్‌ ఉంటుందని ఉన్నతాధికారులు తెలిపారు. ప్రతి రోజు రెండు దశల్లో ఆన్‌లైన్‌ విధానంలో పరీక్ష జరగనుంది.


Also read: Wine Shops In Telangana: మందుబాబులకు షాక్, ఆ 2 రోజులు వైన్‌షాప్‌లు బంద్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook