Wine Shops In Telangana: మందుబాబులకు షాక్, ఆ 2 రోజులు వైన్‌షాప్‌లు బంద్

Wine Shops In Telangana | హైదరాబాద్- మహబూబ్ నగర్- రంగారెడ్డి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ, వరంగల్- ఖమ్మం- నల్గొండ ఎమ్మెల్సీ స్థానాలకు మార్చి 14న పోలింగ్ జరగనుంది. ఈ మేరకు ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ప్రస్తుతం బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్, ఇతర పార్టీలు హోరాహోరీగా ప్రచారం నిర్వహిస్తున్నాయి.

Written by - Shankar Dukanam | Last Updated : Mar 5, 2021, 11:27 AM IST
  • తెలంగాణ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి
  • ఈ నేపథ్యంలో రెండు రోజులపాటు వైన్‌షాప్‌లు బంద్ కానున్నాయి
  • మార్చి 14న రెండు స్థానాల్లో ఉమ్మడి జిల్లాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు
Wine Shops In Telangana: మందుబాబులకు షాక్, ఆ 2 రోజులు వైన్‌షాప్‌లు బంద్

Wine Shops In Telangana To Remain Closed For Two Days: తెలంగాణ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు దగ్గర పడుతున్నకొద్దీ రాజకీయ నాయకులు ప్రచారం జోరు పెంచారు. ఉమ్మడి నల్గొండ, వరంగల్, ఖమ్మం జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు, మరోవైపు మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ పట్టబద్రుల ఎమ్మెల్సీ స్థానానికి మరికొన్ని రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి.

ఈ నేపథ్యంలో తెలంగాణలో మందుబాబులకు షాక్ తగలనుంది. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో రెండు రోజుల పాటు వైన్‌షాప్‌లు బంద్ చేయనున్నారు. ఎన్నికల ప్రచారం ముగిసే సమయంతో పాటు ఎన్నికలు జరిగే వరకు 2 రోజులపాటు మద్యం విక్రయాలు తెలంగాణ(Telangana)లో బంద్ చేయాలని అబ్కారీ శాఖ ఆదేశించింది. మార్చి 12న సాయంత్రం 4 గంటల నుంచి మార్చి 14న సాయంత్రం సాయంత్రం నాలుగు గంటల వరకు వైన్‌షాప్‌లు బంద్ ఉంటాయని ఎక్సైజ్ శాఖ అధికారులు తెలిపారు.

Also Read: EPF Interest Rate: EPFO ఖాతాదారులకు కేంద్రం శుభవార్త, 6 కోట్ల మంది హర్షం

కాగా, హైదరాబాద్(Hyderabad)- మహబూబ్ నగర్- రంగారెడ్డి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ, వరంగల్- ఖమ్మం- నల్గొండ ఎమ్మెల్సీ స్థానాలకు మార్చి 14న పోలింగ్ జరగనుంది. ఈ మేరకు ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ప్రస్తుతం బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్, ఇతర పార్టీలు హోరాహోరీగా ప్రచారం నిర్వహిస్తున్నాయి.

Also Read: Gold Price Today In Hyderabad 5 March 2021: బులియన్ మార్కెట్‌లో 10 రోజుల కనిష్టానికి బంగారం ధరలు, వెండి ధరలు 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News