BiggBoss Harika: హారికకు షాక్ ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం, వెబ్‌సైట్ నుంచి తొలగింపు
BiggBoss Harika: బిగ్‌బాస్ ఫేమ్ దేత్తడి హారికను తెలంగాణ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్‌గా హారిక నిమామక వివరాల్ని అధికారిక వెబ్‌సైట్ నుంచి తొలగించింది. ప్రభుత్వానికి తెలియకుండా జరగడమే దీనికి కారణంగా తెలుస్తోంది.
BiggBoss Harika: బిగ్‌బాస్ ఫేమ్ దేత్తడి హారికను తెలంగాణ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్‌గా హారిక నిమామక వివరాల్ని అధికారిక వెబ్‌సైట్ నుంచి తొలగించింది. ప్రభుత్వానికి తెలియకుండా జరగడమే దీనికి కారణంగా తెలుస్తోంది.
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 4లో(BIggBoss Telugu Season 4) టాప్ 5లో నిలిచిన యూ ట్యూబర్ దేత్తడి హారిక( Dethadi Harika)ఆనందం 24 గంటల్లోనే ఆవిరైపోయింది. తెలంగాణ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం(World womens Day) సందర్బంగా రాష్ట్ర టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ శ్రీనివాస్ నేరుగా దేత్తడి హారికను టూరిజం బ్రాండ్ అంబాసిడర్(Telangana tourism brand ambassador)గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అంతేకాకుండా ఆమెకు ఆర్డర్ కూడా ఇచ్చేశారు. ఈ విషయంపై వివాదం రాజుకుంది. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రికి, ఉన్నతాధికారులకు తెలియకుండా ఈ నియామకం జరిగనట్టు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై పర్యాటక మంత్రితో పాటు ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. వ్యవహారం కాస్తా ఛీఫ్ సెక్రటరీ వరకూ వెళ్లింది. దీంతో అప్రమత్తమైన అధికారులు అధికారిక వెబ్‌సైట్ (Official website)నుంచి హారిక నియామకానికి సంబంధించిన వివరాల్ని తొలగించేశారు.
హారిక కంటే ముందు ఈ పదవిలో ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా(Sania Mirza) ఉన్నారు. ఇప్పుడామె పేరును తొలగించిన హారికను నియమించారు. వివాదం రేగడంతో హారిక నియామక వివరాల్ని తొలగించేశారు. అటు హారిక నియామకంపై పెద్దఎత్తున విమర్శలు వచ్చాయి. ఏ అర్హత ఆధారంగా బ్రాండ్ అంబాసిడర్‌గా నియమిస్తారంటూ నెటిజన్లు మండిపడ్డారు. యూ ట్యూబర్ కావడం, బిగ్‌బాస్‌లో పాల్గొనడమే అర్హతలా అని ప్రశ్నించారు. ఎవరెస్ట్ సహా ప్రపంచంలోని ఆరు ఎత్తైన పర్వతాల్ని అధిరోహించిన మాలావత్ పూర్ణ, మిస్ ఇండియా వారణాసి మానస వంటివారిని ఎంపిక చేయవచ్చు కదా అని సూచిస్తున్నారు.
Also read: Dethadi Harika: బిగ్ బాస్ తెలుగు ఫేమ్ దేత్తడి హారికకు Telangana ప్రభుత్వం బంపరాఫర్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook