TS Eamcet 2023: తెలంగాణ ఎంసెట్‌లో కీలక నిర్ణయం, ఇకపై నో వెయిటేజ్ మార్క్స్
TS Eamcet 2023: ఇది కొందరికి గుడ్‌న్యూస్. ఇంకొందరికి బ్యాడ్ న్యూస్. ఎంసెట్‌లో ఇక ఇంటర్మీడియట్ మార్కుల ప్రస్తావన ఉండదు. ఇంటర్ వెయిటేజ్ మార్కుల్ని రద్దు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
TS Eamcet 2023: ఎంసెట్ విద్యార్ధులకు కీలకమైన సమాచారమిది. ఇన్నాళ్లూ ఎంసెట్ ర్యాంకుల్లో అమల్లో ఉన్న ఇంటర్మీడియట్ మార్కుల వెయిటేజ్ ఇకపై ఉండదు. ఇంటర్ వెయిటేజ్ మార్కుల విధానాన్ని శాశ్వతంగా తొలగిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
తెలంగాణ ఎంసెట్ విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎంసెట్‌లో ఇంటర్ మార్కుల వెయిటేజ్ ఇకపై ఉండదు. ఈ మేరకు వెయిటేజ్ మార్కుల విదానాన్ని శాశ్వతంగా తొలగిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వం జీవో నెంబర్ 18 విడుదల చేసింది. రాష్ట్రంలో ఇంజనీరింగ్, ఫార్మా, అగ్రికల్చర్, మెడికల్, ఫార్మసీ రంగాల్లో ప్రవేశాలకు ఎంసెట్‌లో ఇంటర్ వెయిటేజ్ అమలు చేస్తూ తొలిసారిగా ఈ నిర్ణయాన్ని 2011లో తీసుకున్నారు.
ఎంసెట్ మార్కులకు 75 శాతం, ఇంటర్ మార్కులకు 25 శాతం వెయిటేజ్ కేటాయించారు. ఈ రెండింటినీ కలిపి ర్యాంకు నిర్ణయించేవారు. ఈ విధానం వల్ల విద్యార్ధులు నష్టపోతున్నారనే వాదనలు పెరుగుతున్నాయి. దాంతో ఇంటర్ వెయిటేజ్ మార్కుల రద్దుపై అధ్యయనం చేసేందుకు ప్రభుత్వం కమిటీ వేసింది. అన్ని వర్గాలు, శాఖల్నించి సమాచారం తీసుకుని..వెయిటేజ్ మార్కుల విధానాన్ని రద్దు చేసింది.
2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి తెలంగాణ ఎంసెట్ మే 10, 11 తేదీల్లో జరగనుంది. ఇంజనీరింగ్ పరీక్ష మే 12, 13, 14 తేదీల్లో నిర్వహించనున్నారు. రెండు పరీక్షలు రెండు సెషన్లలో జరగనున్నాయి.
Also read: Minister Singireddy Niranjan Reddy: తనకు ఆ ఆస్తులు ఎలా వచ్చాయో చెప్పిన మంత్రి నిరంజన్ రెడ్డి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook