Aarogyasri Scheme: తెలంగాణలో అధికారంలో వస్తే పేదల కష్టాల్ని తీర్చే ఆరు హామీల్ని అమలు చేస్తామన్న కాంగ్రెస్ పార్టీ ఇవాళ రెండు పథకాలకు శ్రీకారం చుట్టింది. మహిళల ఉచిత బస్సు ప్రయాణంతో పాటు రాజీవ్ ఆరోగ్య శ్రీ పరిధిని పెంచుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీకు తగ్గట్టుగానే ఆరోగ్య శ్రీ పరిధిని పెంచుతూ నిర్ణయం తీసుకుంది తెలంగాణ ప్రభుత్వం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తెలంగాణలో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు గుడ్‌న్యూస్ అందించింది. ఆరోగ్య శ్రీ విషయంలో తీసుకున్న కీలక నిర్ణయం పట్ల తెలంగాణ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో ఆరోగ్య శ్రీ వైద్య ఖర్చును 10 లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. ఈ నిర్ణయం తక్షణం ఇవాళ్టి నుంచే అమల్లోకి రానుంది. ఇప్పటి వరకూ ఆరోగ్య శ్రీ పధకంలో 5 లక్షల వరకే ఖర్చుకు పరిమితి ఉంది. ఇక నుంచి ఈ పరిమితి 10 లక్షలకు పెరిగింది. 2004లో ఉమ్మడి ఆంద్రప్రదేశ్‌లో ఆరోగ్య శ్రీ పధకాన్ని తొలిసారిగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రారంభించారు. తెలంగాణలో ప్రస్తుతం 77 లక్షల 19 వేలమందికి ఆరోగ్య శ్రీ కార్డులున్నాయి. రాష్ట్రంలో 1310 ఆసుపత్రుల్లో ఆరోగ్య శ్రీ సేవలు అందుబాటులో ఉండగా ఇందులో 293 ప్రైవేట్ ఆసుపత్రులు, 198 ప్రభుత్వ ఆసుపత్రులు ఉన్నాయి. తెలంగాణలో అమలవుతున్న ఆరోగ్య శ్రీ పధకంలో 1376 శస్త్ర చికిత్సలు, 289 వైద్య సేవలున్నాయి.


కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో ఒకటైన ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పధకాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కలు అసెంబ్లీ ప్రాంగణంలో ఇవాళ ప్రారంభించారు. అదే సమయంలో రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకం పరిమితిని పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. 


Also read: Rains Alert: ఏపీలోని ఈ జిల్లాలకు మళ్లీ వర్షసూచన, రానున్న 24 గంటల్లో వర్షాలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook