Nampally Exhibition 2022: గవర్నర్ తమిళిసై చేతుల మీదుగా అట్టహాసంగా ప్రారంభమైన నాంపల్లి ఎగ్జిబిషన్
Nampally Exhibition 2022: హైదరాబాద్ లోని నాంపల్లి గ్రౌండ్స్ లో 81వ ఎగ్జిబిషన్ అట్టహాసంగా మొదలైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తో పాటు రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీ చేతుల మీదుగా ఈ ఎగ్జిబిషన్ ప్రారంభమైంది. ఎగ్జిబిషన్ కు వచ్చే వాళ్లు తప్పనిసరిగా కొవిడ్ నిబంధనలను పాటించాలని.. మాస్క్ ధరించని వారికి అనుమతించవద్దని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అధికారులను ఆదేశించారు.
Nampally Exhibition 2022: హైదరాబాద్ లోని నాంపల్లి వేదికగా 81వ ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ 'నుమాయిష్ 2022' మొదలైంది. తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ శనివారం అధికారికంగా ఈ ఎగ్జిబిషన్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీని విచ్చేశారు.
ఈ కార్యక్రమంలో సౌందరరాజన్ మాట్లాడుతూ.. "ఒక వైద్యురాలిగా, ఇక్కడ కోవిడ్-19 వ్యాక్సినేషన్ ప్రచారం కూడా నిర్వహిస్తున్నందున నేను చాలా సంతోషంగా ఉన్నాను. తెలంగాణ ప్రజల భద్రత కోసం రాష్ట్రం తీసుకున్న నిర్ణయాలను నేను నిజంగా అభినందిస్తున్నాను. ఈ ఎగ్జిబిషన్ కేవలం వినోదం కోసం మాత్రమే కాదు, విద్య కోసం. ఈ ప్రదర్శన ద్వారా 30,000 మందికి పైగా విద్యార్థులు ప్రయోజనం పొందుతున్నారు" అని అన్నారు.
ఈ ఎగ్జిబిషన్ లో కాశ్మీరి నుంచి కన్యాకుమారి వరకు ఉన్న ఎంతోమంది కళాకారులు వారి చేవృత్తుల ఆధారంగా ఇందులో భాగమయ్యారు. దీన్ని సందర్శించి అలాంటి కళాకారులకు చేయూతనివ్వాలని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నుమాయిష్‌లో టీకా కేంద్రం ఉండటం ఎంతో సంతోషకరమని ఆమె అన్నారు. ప్రజలు కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ఎగ్జిబిషన్‌కు రావడం సహా మాస్క్ పెట్టుకోని వాళ్లను నుమాయిష్‌లోకి అనుమతించవద్దని తమిళిసై సౌందరరాజన్ అధికారులను ఆదేశించారు.
45 రోజుల పాటు అంటే (జనవరి 1 నుంచి ఫిబ్రవరి 15 వరకు) 81వ అఖిల భారత పారిశ్రామిక వస్తు ప్రదర్శన సాగనుంది. ఈసారి ఒమిక్రాన్ వ్యాప్తి కారణంగా.. స్టాళ్ల సంఖ్యను 2,000కు తగ్గించారు. ప్రదర్శనలో పలు అకాడమీలకు చెందిన పుస్తకాలతో పాటు రకరకాల వస్తువులు, రుచికరమైన ఆహార పదార్థాలు కూడా అందుబాటులో ఉండనున్నాయి. వాక్సిన్ తీసుకొని వాళ్ల కోసం నుమాయిష్‌లోనూ టీకా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.
Also Read: Sankranthi Special Trains: సంక్రాంతికి 10 స్పెషల్ ట్రైన్స్ ఏర్పాటు చేసిన దక్షిణ మధ్య రైల్వే
Also Read: Telangana Omicron Cases: తెలంగాణలో కొత్తగా మరో 12 ఒమిక్రాన్ కేసులు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి