పనిచేయని సర్పంచ్లు, కార్యదర్శులను పక్కకు పెడితే తప్పులేదు : సీఎం కేసీఆర్
అనాదిగా వున్న పంచాయితీల పాత స్వరూపాన్ని మార్చి గ్రామీణాభివృద్ధిలో పారదర్శకతను పెంపొందేంచుకు కొత్త పంచాయతీ రాజ్ చట్టం
అనాదిగా వున్న పంచాయితీల పాత స్వరూపాన్ని మార్చి గ్రామీణాభివృద్ధిలో పారదర్శకతను పెంపొందేంచుకు కొత్త పంచాయతీ రాజ్ చట్టం ప్రవేశపెట్టినట్టు తెలంగాణ సీఎం కేసీఆర్ తెలిపారు. ఈ కొత్త చట్టంతో అధికార వీకేంద్రీకరణతో పాటు ప్రజా ప్రతినిధుల్లో బాధ్యతను, జవాబుదారీతనాన్ని పెంచేందుకు అవకాశం కలుగుతుందని ఆయన స్పష్టంచేశారు. నిధులు, విధులతో పాటు పంచాయితీల బాధ్యతలు పెరగాల్సిన అవసరం వుంది. అంతేకాకుండా పనిచేయని సర్పంచ్‌లను, కార్యదర్శులను తొలగించినా తప్పులేదని ముఖ్యమంత్రి కేసీఆర్ అభిప్రాయపడ్డారు. అయితే అనుభవజ్ఞులతో కూడిన అప్పిలేట్ అథారిటీని ఆశ్రయించే అధికారం సదరు సర్పంచ్‌లకు ఉంటుందని తేల్చిచెప్పారు. తండాలను పంచాయితీలుగా మారుస్తున్న బిల్లు వల్ల కలిగే ప్రయోజనాలను ప్రస్తావించే క్రమంలో ముఖ్యమంత్రి ఈ కొత్త పంచాయతీ రాజ్ చట్టం గురించి వివరించారు.
ఈ సందర్భంగా వంద ఓటర్లున్న పంచాయితీలకు కనిష్టంగా ప్రతి ఏడాది 3 లక్షల రూపాయల నిధులు కేటాయించనున్నట్టు సీఎం హామీ ఇచ్చిన సీఎం.. పంచాయతీల్లో బీసీలకు అన్యాయం జరగకుండా చూస్తామని అన్నారు.