ఆ రెండు రోజులు సెలవు దినాలే..
ఆ రెండు రోజులను సెలవు దినాలుగా ప్రకటించిన తెలంగాణ సర్కార్..
ఎన్నికల కమిషన్ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం తెలంగాణలో డిసెంబరు 7న రాష్ట్ర శాసన సభకు ఎన్నికలు జరగనుండగా, 11వ తేదీన ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపట్టనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో డిసెంబర్ 7, 11 తేదీలను అధికారిక సెలవు దినాలుగా ప్రకటిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంచేసింది. తెలంగాణలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలకు ఈ సెలవులు వర్తిస్తాయని రాష్ట్ర ప్రభుత్వం తేల్చిచెప్పింది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్.కే. జోషి మంగళవారం ఓ జీవో జారీ చేశారు.