హైదరాబాద్: తెలంగాణలో రైతులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త వినిపించింది. రాష్ట్రంలో అమలు చేస్తున్న రైతు బంధు పథకంలో భాగంగా రైతులకు ప్రభుత్వం అందించే ఆర్థిక సాయాన్ని మరో రూ.1000 పెంచుతూ తెలంగాణ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయంతో ఇప్పటివరకూ ఎకరానికి రూ.4,000 ఆర్థిక సహాయం పొందుతున్న రైతులు ఇకపై అదే ఎకరానికి రూ.5,000 అందుకోనున్నారు. రెండు సీజన్‌లు కలిపి మొత్తం రూ.10,000 వరకు రైతులకు పంట సాయం అందనుంది. దీంతో రైతన్నలకు ఇంకొంత అదనపు లబ్ధి చేకూరనుంది.


తెలంగాణ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయం రైతన్నలను మరింత ఆనందానికి గురిచేస్తోంది. ఈ పథకం కింద లబ్ధి చేకూరే మొత్తాన్ని పెంచడం వల్ల ఇకపై రాష్ట్ర ప్రభుత్వంపై ఎంత అధనపు భారం పడనుందనే వివరాలు తెలియాల్సి ఉంది.