Chiru Thanks to KCR: సినిమా టికెట్ ధరల పెంపునకు అనుమతి.. సీఎం కేసీఆర్ కు మెగాస్టార్ కృతజ్ఞతలు
Chiru Thanks to KCR: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా థియేటర్లలో సినిమా టికెట్ ధరలను పెంచేందుకు అనుమతినిచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం పట్ల టాలీవుడ్ ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ట్విట్టర్ వేదికగా స్పందించిన మెగాస్టార్ చిరంజీవి.. సీఎం కేసీఆర్, ఛీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్, సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ లకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.
Chiru Thanks to KCR: తెలంగాణలో సినిమా టికెట్ ధరలను పెంచేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. తెలంగాణ సర్కారు నిర్ణయంతో టాలీవుడ్ పెద్దలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీంతో సీఎం కేసీఆర్ నిర్ణయాన్ని మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ లో ప్రశంసించారు.
"తెలుగు సినిమా పరిశ్రమ కోరికని మన్నించి, నిర్మాతలకు, పంపిణీదారులకు, థియేటర్ యాజమాన్యానికి అన్ని వర్గాల వారికీ న్యాయం కలిగేలా సినిమా టికెట్ ధరలను సవరించిన తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ కే.చంద్రశేఖర్ రావు గారికి కృతఙ్ఞతలు. సినిమా థియేటర్ల మనుగడకు, వేలాది మంది కార్మికులకు ఎంతో మేలు కలిగే నిర్ణయం ఇద"ని మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు.
ఈ సందర్భంగా తెలంగాణ ఛీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ లకు చిరంజీవి కృతజ్ఞతలు తెలిపారు. "పరిశ్రమ ప్రతినిధులతో ఎన్నో చర్చలు జరిపి అన్ని సమస్యలు అర్ధం చేసుకున్న చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, పరిశ్రమ బాగు కోసం చొరవ తీసుకున్న ఎంపీ సంతోష్ కుమార్‌కు ప్రత్యేక ధన్యవాదాలు’’ అని చిరు పేర్కొన్నారు.
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో సినిమా టికెట్ల వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సినిమా టికెట్ ధరలను తగ్గించింది. మరోవైపు టికెట్ రేట్లు పెంచాలనే నిర్మాతల విజ్ఞప్తి మేరకు తెలంగాణ ప్రభుత్వానికి అధికారులు ప్రతిపాదనలు పంపారు. వాటిని పరిశీలించిన తెలంగాణ సర్కారు టికెట్ రేట్లు పెంచుకునేందుకు అవకాశం కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంపై సినీ ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: Unstoppable With NBK: బాలయ్య షోలో స్టైలిష్ స్టార్.. ఒకరు తొడగొడితే మరొకరు మీసం తిప్పారు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి