Unstoppable With NBK: బాలయ్య షోలో స్టైలిష్ స్టార్.. ఒకరు తొడగొడితే మరొకరు మీసం తిప్పారు

Unstoppable With NBK: కథానాయకుడు బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే షో లో 'పుష్ప' మూవీ టీమ్ సందడి చేసింది. హీరో అల్లు అర్జున్ తో పాటు హీరోయిన్ రష్మిక, డైరెక్టర్ సుకుమార్ అందులో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ప్రోమో శుక్రవారం విడుదలైంది. ఇందులో అల్లు అర్జున్ గా నడుస్తూ బాలయ్య 'పుష్ప' డైలాగ్ చెప్పడం హైలైట్ గా నిలిచింది.    

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 25, 2021, 01:47 PM IST
    • పుష్పరాజ్ ను ఇమిటేట్ చేసిన నందమూరి బాలకృష్ణ
    • అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకేలో ముఖ్యఅతిథిగా హీరో అల్లు అర్జున్
    • కార్యక్రమానికి హాజరైన హీరోయిన్ రష్మిక, డైరెక్టర్ సుకుమార్
Unstoppable With NBK: బాలయ్య షోలో స్టైలిష్ స్టార్.. ఒకరు తొడగొడితే మరొకరు మీసం తిప్పారు

Unstoppable With NBK: నందమూరి నటసింహం బాలకృష్ణ, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కలిసి మరోసారి ఒకే స్టేజ్ పై సందడి చేయనున్నారు. 'ఆహా' ఓటీటీలో బాలయ్య హోస్ట్​ చేస్తున్న 'అన్​స్టాపబుల్​ విత్​ ఎన్​బీకే' షోకు ఆయన ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. 'పుష్ప' సినిమా ప్రమోషన్స్ లో భాగంగా అల్లు అర్జున్, హీరోయిన్ రష్మిక, డైరెక్టర్ సుకుమార్ కలిసి ఈ షో లో సందడి చేశారు. సినిమాకు సంబంధించిన కొన్ని విశేషాలతో పాటు అతిథులుగా విచ్చేసిన వారిపై ఉన్న రూమర్ల గురించి స్పష్టత ఇచ్చారు. 

దీనికి సంబంధించిన ప్రోమోను ఆహా ఓటీటీ సంస్థ శుక్రవారం విడుదల చేసింది. ఈ ప్రోమోలో అల్లు అర్జున్ ఎంట్రీ కొత్తగా ఉంది. ఆ తర్వాత 'పుష్ప' సినిమా దర్శకుడు సుకుమార్, హీరోయిన రష్మిక కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రోమో చివర్లో అల్లు అర్జున్ స్టైల్ లో బాలయ్య నడుస్తూ వచ్చి.. "పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా... ఫైర్.. తగ్గేదేలే" అనే డైలాగ్ ను చెప్పడంతో అభిమానులంతా ఒక్కసారిగా విజిల్స్ తో ఆడిటోరియాన్ని ఓ ఊపు ఊపారు. ఈ ఎపిసోడ్ ను త్వరలోనే ప్రసారం చేయనున్నట్లు ఆహా సంస్థ ప్రకటించింది. 

బాక్సాఫీసు ముందు 'పుష్ప' సందడి

'పుష్ప'తో బాక్సాఫీస్​ వద్ద కలెక్షన్ల రికార్డులు సృష్టిస్తున్నాడు అల్లు అర్జున్. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఈ నెల 17న ప్రేక్షకుల మందుకు వచ్చి పాజిటివ్​ టాక్​తో దూసుకుపోతోంది. 'పుష్ప' విడుదలైన వారం తర్వాత రూ.227 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసినట్లు నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. త్వరలోనే రూ.500 కోట్ల కలెక్షన్ల మార్క్ ను చేరుకుంటామని నిర్మాతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు సినిమాలో బన్నీ  నటనకు అభిమానులు సహా ఇండస్ట్రీ ప్రముఖులు ఫిదా అవుతున్నారు.

ఇటీవలే 'అఖండ'తో థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన బాలయ్య భారీ విజయాన్ని అందుకున్నారు. ఆయన కెరీర్​లోనే బిగ్గెస్ట్​ హిట్​గా నిలిచిన చిత్రమది. ఈ విజయాన్ని ఆస్వాదిస్తున్న ఆయన.. మళ్లీ తన తొలి టాక్​ షో అన్​స్టాపబుల్​తో బిజీ అయ్యారు. ఈ క్రమంలోనే ఇటీవలే దర్శకుడు గోపీచంద్ మలినేనితో పాటు హీరో రవితేజ ఈ షో లో సందడి చేశారు. ఇప్పుడు ఈ కార్యక్రమంలో 'పుష్ప' సందడి చేయనుంది. 

క్రిస్మస్ కు ప్లాన్ చేసినా..

అయితే అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే షోలో హీరో అల్లు అర్జున్ గెస్ట్ గా వచ్చిన ఎపిసోడ్ ను తొలుత క్రిస్మస్ సందర్భంగా విడుదల చేయనున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే శుక్రవారం విడుదలైన ప్రోమోలో ఈ ఎపిసోడ్ ను త్వరలోనే ప్రసారం చేస్తామని ఆహా ఓటీటీ సంస్థ క్లారిటీ ఇచ్చింది.   

Also Read: Trolls on Hero Nani: హీరో నానిపై సోషల్ మీడియాలో ట్రోలింగ్.. సినిమా టికెట్లపై స్పందించడమే కారణమా?

Also Read: 83 Movie Review: 1983 ఇండియన్ టీమ్ కు సరైన ట్రిబ్యూట్ '83' మూవీ!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News