Telangana Govt issues Corona precautions : తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి కొనసాగుతోంది. గత కొన్ని రోజులుగా చాపకింద నీరులా వైరస్ వ్యాపిస్తోంది. రాష్ట్రంలో కొవిడ్ కొత్త కేకేసులు భారీగా పెరిగాయి. మంగళవారం (జూన్ 21) 26,704 మంది నమూనాలు పరీక్షించగా.. కొత్తగా 403 కరోనా కేసులు నమోదయ్యాయి. కొవిడ్‌ బారి నుంచి నేడు 145 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 2,375కి చేరిందని వైద్యరోగ్యశాఖ పేర్కొంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గత వారంతో పోలిస్తే నేడు రెట్టింపు కేసులు నమోదయ్యాయని వైద్యరోగ్యశాఖ బులిటెన్‌లో వెల్లడించింది. మరోవైపు దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. గత కొన్ని రోజులుగా 12 వేలకు పైగానే నమోదైన కొత్త కేసులు మంగళవారం 10వేల దిగువకు చేరాయి. అయితే పలు రాష్ట్రాల్లో వైరస్‌ విస్తరిస్తుండటంతో క్రియాశీల కేసులు 79 వేలకు పైగా ఉన్నాయి. దేశంలో, రాష్ట్రాల్లో కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు పలు సూచనలు జారీ చేసింది. 


తెలంగాణ ప్రభుత్వం సూచనలు ఇవే:
# 10 సంవత్సరాల లోపు పిల్లలు, 60 ఏళ్ల పైబడిన వారు అవసరం ఉంటేనే బయటికి వెళ్లాలి. 
# ఇంటి నుంచి బయటికి వెళితే తప్పనిసరిగా మాస్క్ ధరించాలి. 
# బయటికి వెళ్లినప్పుడు ప్రతిఒక్కరు 6 ఫీట్ దూరం మైంటైన్ చేయాలి. 
# ఆఫీసులలో ఉద్యోగులకు సోప్, శానిటైజర్ యాజమాన్యాలు అందుబాటులో ఉంచాలి. ఫిజికల్ డిస్టన్స్ మైంటైన్ చేయాలి. 
# ప్రజలు ప్రణయాల్లో మాస్క్, శానిటైజర్,  ఫిజికల్ డిస్టన్స్ మైంటైన్ చేయాలి. 
# దగ్గు, జలుబు, జ్వరం, బాడీ పైన్స్, నీరసం, తలనొప్పి లాంటి లక్షణాలు ఉంటే.. వెంటనే దగ్గరలోకి ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి రిపోర్ట్ చేయండి. 
# డయాబెటిస్, హార్ట్ ఎటాక్, క్యాన్సర్, కిడ్నీ సమస్యలు ఉన్నవారు బయటకు రాకుండా జాగ్రత్తగా ఉండాలి. 
# రెండు డోసుల వాక్సినేషన్ తప్పనిసరిగా తీసుకోండి. 


Also Read: Vijay's Varisu First Look: అల్ట్రా స్టైలిష్ లుక్లో అదరకొడుతున్న విజయ్.


Also Read: Book My Show : 'షో' మాయాజాలం.. వడ్డీ లేని రుణాలిచ్చి మరీ లాక్?



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook