Vijay's Varisu First Look: అల్ట్రా స్టైలిష్ లుక్లో అదరకొడుతున్న విజయ్.

Vijay's Varisu First Look Released: తమిళ స్టార్ హీరో విజయ్ తెలుగు దర్శకుడు వంశీ పైడిపల్లి కాంబోలో తెరకెక్కిన సినిమాకు టైటిల్ ఫిక్స్ చేశారు. విజయ్ పుట్టిన రోజు సంధర్భంగా టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ కూడా విడుదల చేశారు.   

Last Updated : Jun 21, 2022, 07:02 PM IST
  • విజయ్-వంశీ పైడిపల్లి సినిమాకు టైటిల్ ఫిక్స్
  • తమిళ్ లో వారిసు అంటూ ప్రకటన
  • తెలుగులో వారుసుడు ఫిక్స్ చేసే అవకాశం
Vijay's Varisu First Look: అల్ట్రా స్టైలిష్ లుక్లో అదరకొడుతున్న విజయ్.

Vijay's Varisu First Look Released : ఈ మధ్య కాలంలో మార్కెట్ పరిధి పెరగడంతో తమిళ హీరోలు - తెలుగు దర్శకులు, తెలుగు దర్శకులు- తమిళ హీరోలు అంటూ క్రాస్ఓవర్ ప్రాజెక్టులు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అదే విధంగా తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ హీరోగా తెలుగు దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఒక ప్రాజెక్టు అనౌన్స్ చేశారు. మహర్షి సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న వంశీ పైడిపల్లి మళ్లీ మహేష్ బాబుతోనే ఒక సినిమా చేసే అవకాశం ఉందని ప్రచారం జరిగింది. కానీ అనూహ్యంగా ఆయన తమిళ హీరో విజయ్ కి కథ చెప్పి ఓకే చేయించుకున్నారు. 

ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మాణంలో భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమాలో రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాకి ముందు నుంచి కూడా అనేక రకాల టైటిల్స్ గురించి ప్రచారం జరిగింది కానీ ఎట్టకేలకు విజయ్ పుట్టిన రోజు కానుకగా ఈ సినిమా టైటిల్ ప్రకటించారు. తమిళ తెలుగు ద్విభాషా చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమా టైటిల్ తమిళంలో వారిసు అని తెలుగులో వారసుడు అని ప్రకటించారు. ప్రస్తుతానికైతే తమిళం పోస్టర్ ఒకటే షేర్ చేశారు కానీ తెలుగు పోస్టర్ కూడా షేర్ చేసే అవకాశం ఉందని అంటున్నారు.

సినిమా ప్రకటించిన నాటి నుంచే ఈ సినిమా మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దానికి తోడు ఈ సినిమాలో భారీ ఎత్తున స్టార్ నటీనటులను మోహరించడంతో సినిమా మీద అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.. తాజాగా ఈ సినిమా టైటిల్ కూడా ప్రకటించడంతో ఆ అంచనాలు రెట్టింపు అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. రిలీజ్ చేసిన పోస్టర్లో వారిసు అని కాస్త పాత టైటిల్ పెట్టారు కానీ విజయ్ లుక్ మాత్రం చాలా అల్ట్రా స్టైలిష్ గా కనిపిస్తోంది. అంటే ఎక్కడో విదేశాల్లో స్థిరపడి మళ్లీ తన మూలాలు వెతుక్కుంటూ వచ్చే సబ్జెక్టు లాగానే కనిపిస్తోందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

వంశీ పైడిపల్లి గత చిత్రం మహర్షిలో కూడా హైదరాబాదులో చదువుకొని వెళ్లి అమెరికాలో స్థిరపడి కోట్లు సంపాదిస్తున్న వ్యక్తి తన మూలాలు వెతుక్కుంటూ వెనక్కి వచ్చినదే అని గుర్తు చేస్తున్నారు. మరికొందరైతే ఒక అడుగు ముందుకు వేసి వంశీ పైడిపల్లి ఇదే కథను మహేష్ బాబుతో కూడా తీయడానికి ప్రయత్నించాడని మహర్షి పోలికలు ఉండడంతో ఆయన చేయను అని చెప్పడంతో ఆ సబ్జెక్ట్ ని తీసుకువెళ్లి విజయ్ తో ఓకే చేయించుకుని ఉండి ఉండవచ్చని కామెంట్లు చేస్తున్నారు. ఏదైతేనేమి విజయ్ అభిమానులు మాత్రం తమ అభిమాన హీరో ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల కావడంతో పాటు టైటిల్ కూడా వచ్చేయడంతో ఒక రోజు ముందుగానే పండగ చేసుకుంటున్నారు. ఇక ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, ఆర్. శరత్‌ కుమార్, కిక్ శ్యామ్, యోగిబాబు, ప్రభు, జయసుధ, శ్రీకాంత్, సంగీత క్రిష్, సంయుక్త షణ్ముఘనాథన్, ఖుష్బూ వంటి వారు ఇతర కీలక పాత్రలలో నటిస్తున్నారు. 

Also Read : Thalapathy Vijay : ఆఫీసులో వ్యక్తి అనుమానాస్పద మృతి.. మిస్టరీగా మారిన పరోటా?

Also Read : Thalapathy 66: లీకైన విజయ్, రష్మిక షూటింగ్ ఫోటోలు... సోషల్ మీడియాలో వైరల్...

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News