Face Mask Mandatory in Telangana from Today: దేశవ్యాప్తంగా కరోనా కొత్త వేరియంట్ భయాలు కొనసాగుతున్న నేపథ్యంలో తెలంగాణా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మరోసారి కఠిన కొవిడ్ నిబంధనలను అమలు చేసేందుకు (COVID guidelines in Telangana) సిద్ధమైంది. ఇందులో భాగంగా.. బహిరంగ ప్రదేశాల్లో తిరిగే వారికి మాస్క్​ తప్పనిసరి (Face Mask Mandatory in Telangana) చేసింది. ఎవరైనా మాస్క్ లేకుండా బహిరంగ ప్రదేశాల్లో తిరిగితే.. రూ.1000 వరకు జరిమానా విధించనున్నట్లు తెలిపింది.


కరోనా కట్టడికోసం ప్రతి ఒక్కరి విధిగా మాస్కు ధరించి సహకరించాలని కోరింది.


ఈ వివరాలను మీడియా ద్వారా ప్రజలకు తెలియజేశారు తెలంగాణ ఆరోగ్య శాఖ డైరెక్టర్ డీహెచ్​​ శ్రీనివాస్ (Telangana DH srinivas)​.


భారత్​లో ఒమిక్రాన్ వేరింయట్ (omicron variant in India)​ ఏ క్షణాంలోనైనా బయపడొచ్చని కాబట్టి అందరూ అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరు రెండు డోసు వ్యాక్సిన్ తప్పకుండా తీసుకోవాలని సూచించారు.


మాస్క్​ పెట్టుకోకపోవడం, వ్యాక్సిన్ వేసుకోకపోవడం వంటి నిర్లక్ష్యాల వల్ల.. థార్ఢ్​ వేవ్​ గురింంచిన అసత్య ప్రచారాలను నిజం చేసినవాళ్లమవుతామని పేర్కొన్నారు.


వైరస్​ పూర్తిగా కనుమరుగు కాలేదని డీహెచ్​ శ్రీనివాస్ పేర్కొన్నారు. అది ఇంకా మనతోనే ఉందని తెలిపారు. మనం పెట్టుకునే మాస్క్ వ్యాక్సిన్​ కంటే పవర్​ ఫుల్ అని తెలిపారు. వ్యక్తిగత, సామాజిక బాధ్యతగా మాస్క్​ ధరించాలని కోరారు.


కరోనా మొదటి రెండు దశలు.. ఉన్నఫలంగా వచ్చాయని అయితే ఒమిక్రాన్ వేరింయట్ మాత్రం మనకు ఓ హెచ్చరిక ఇచ్చినట్లు పేర్కొన్నారు శ్రీనివాస్. భౌతిక దూరం పాటించడం, సమూహాలుగా తిరగకపోవడం వంటి వాటి ద్వారా మనను మనం రక్షించుకోవచ్చని.. థార్ఢ్​ వేవ్​ నుంచి కూడా తెలంగాణ బయటపడగలుగుతుందని వివరించారు.


Also read: Mother, Child suicide : ఎంత కష్టమొచ్చిందో.. 9 నెలల కుమార్తెను నడుముకు కట్టుకుని ఆత్మహత్య చేసుకున్న తల్లి


Also read: Road Accident: టైరు పేలి బావిలో పడిన కారు..తల్లీకుమారుడితోపాటు గజఈతగాడు దుర్మరణం


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook