Dubbaka Road Accidnet: సిద్దిపేట జిల్లా(Siddipet District)లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టైరు పేలిపోవడంతో...ఓ కారు అదుపుతప్పి బావిలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో కారులో ఉన్న తల్లీ కుమారుడితోపాటు..సహాయక చర్యల్లో పాల్గొన్న ఓ గజఈతగాడి సైతం జలసమాధి అయ్యారు. దీంతో ఇరు కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఈ ప్రమాదం దుబ్బాక మండలం(Dubbaka) చిట్టాపూర్ శివారులో బుధవారం చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే...
మెదక్ జిల్లా నందిగామకి చెందిన సుదునం ప్రశాంత్(25), తల్లి లక్ష్మి(45)తో కలిసి కారులో బంధువుల ఇంట్లో బారసాలకని హుస్నాబాద్(Husnabad) బయల్దేరారు. మార్గమధ్యలో మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో చిట్టాపూర్ శివారులో(Chittapur) వంతెన సమీపంలో అతివేగంతో టైరు పగిలి కారు అదుపుతప్పి...వ్యవసాయబావిలో దూసుకెళ్లింది. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు హుటాహుటిన చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. దుబ్బాక ఎమ్మెల్యే రఘునందర్‌రావు, ఏసీపీ దేవారెడ్డి దగ్గరుండి సహాయక చర్యలను పర్యవేక్షించారు.
Also Read: Suicide: ప్రేమోన్మాది ప్రేమ్ సింగ్ ఆత్మహత్య-నెల క్రితం యువతిపై హత్యాయత్నం
సుమారు 20 అడుగులకుపైగా లోతు ఉన్న బావి(Well)లో నీటిని తోడేందుకు అధికారులు తీవ్రంగా శ్రమించారు. పలుమార్లు గజ ఈతగాళ్లు సాయంతో కారును గుర్తించేందుకు ప్రయత్నించారు. సహాయక చర్యల్లో భాగంగా...నీటిలోకి దిగిన ఎనగుర్తికి చెందిన గజ ఈతగాడు బండకాడి నర్సింలు(40) దుర్మరణం చెందాడు. . ఘటనా స్థలికి చేరుకున్న ఇరు కుటుంబాల సభ్యులు కన్నీరుమన్నీరు అయ్యారు. అధికారులే నిర్లక్ష్యం కారణంగా నర్సింలు మృతిచెందారంటూ ఆయన బంధువులు ఘటనాస్థలంలో ధర్నాకు దిగారు. మృతుడికి భార్య లత, కుమార్తె, కుమారుడు ఉన్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook