TSPSC Group 1 2022: తెలంగాణలో గ్రూప్-1 ప్రిలిమనరీ పరీక్షకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. తాజాగా కమిషన్ వెబ్‌సైట్‌లో హాల్ టికెట్స్ అందుబాటులోకి వచ్చాయి. దీనికోసం టీఎస్పీఎస్సీ అధికారులు ప్రత్యేక లింక్ పెట్టారు. దాని ద్వారా అభ్యర్థులు హాల్ టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. రాష్ట్రంలో 503 గ్రూప్‌-1 జాబ్స్ కోసం  3,80,202 మంది అప్లై చేసుకున్నారు. ఈనెల 16న ప్రిలిమనరీ పరీక్ష ( Group-1 exam) నిర్వహించి... జనవరి లేదా ఫిబ్రవరిలో మెుయిన్స్ పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇవి గుర్తించుకోండి...
అయితే పరీక్షల నిర్వహణలో టీఎస్‌పీఎస్సీ స్వల్ప మార్పులు చేసింది. పరీక్ష సమయానికి 15 నిమిషాల ముందుగానే ఎగ్జామ్ సెంటర్ గేటు మూసివేసి, అభ్యర్థుల్ని అనుమతించబోమని వెల్లడించింది. వీలైనన్ని బహుళ సిరీస్‌లతో ప్రశ్నపత్రాలను టీఎస్పీఎస్సీ సిద్ధం చేస్తోంది. ఇప్పటి వరకు ఎ, బి, సి, డి సిరీస్‌ల పేరిట నాలుగు ప్రశ్నపత్రాలు అభ్యర్థులకు ఇచ్చేవారు. ఇకపై వాటిని మరింత పెంచేలా టీఎస్పీఎస్సీ ఏర్పాట్లు చేస్తోంది. తెలంగాణ వ్యాప్తంగా  1,041 పరీక్ష కేంద్రాల్లో గ్రూప్-1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ నిర్వహించనున్నారు. అక్టోబరు 16 ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నాం 01 గంట వరకు ఈ పరీక్ష జరుగనుంది. 


పరీక్షా సెంటర్ కు చెప్పులతోనే రావాలని.. షూ ధరించి రావద్దని కమిషన్ స్పష్టం చేసింది. ఒకరి బదులు మరోకరు ఎగ్జామ్ కు వస్తే క్రిమినల్ కేసులు పెట్టడంతోపాటు కమిషన్ పరీక్షల నుంచి డిబార్ చేస్తామని హెచ్చరించంది. సందేహాల నివృత్తికై జిల్లా కలెక్టరేట్లలో గ్రూప్-1 హెల్ప్ డెస్క్ లను ఏర్పాట్లు చేస్తున్నట్లు టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌ బి.జనార్దన్‌రెడ్డి తెలిపారు. ఆదివారం రాత్రి వరకు 1,32,406 మంది అభ్యర్థులు హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకున్నారని ఆయన వెల్లడించారు. 


Also Read: Malla Reddy Liquor Party: ఓటర్లకు మందు పోస్తున్న మంత్రి మల్లారెడ్డి.. ఫోటోలు, వీడియోలు వైరల్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    


Android Link https://bit.ly/3P3R74U 


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook