Gurukulam entrance test: గురుకుల పాఠశాల ప్రవేశ పరీక్షలు వాయిదా
Telangana Gurukulam entrance exam 2021 postponed: తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర గురుకుల పాఠశాలలకు నిర్వహించే ప్రవేశ పరీక్ష (TGCET) వాయిదా వేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం మే 30న జరగాల్సి ఉన్న గురుకుల ప్రవేశ పరీక్షను వాయిదా వేస్తున్నట్లు కన్వీనర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ (TGCET convener RS Praveen Kumar) తెలిపారు.
Telangana Gurukulam entrance exam 2021 postponed: తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర గురుకుల పాఠశాలలకు నిర్వహించే ప్రవేశ పరీక్ష (TGCET) వాయిదా వేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం మే 30న జరగాల్సి ఉన్న గురుకుల ప్రవేశ పరీక్షను వాయిదా వేస్తున్నట్లు కన్వీనర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ (TGCET convener RS Praveen Kumar) తెలిపారు. గురుకల ప్రవేశ పరీక్షకు సంబంధించిన కొత్త తేదీని మరో నొటిఫికేషన్ ద్వారా వెల్లడించనున్నట్టు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు.
గురుకుల పాఠశాలల్లో రానున్న విద్యా సంవత్సరంలో 5వ తరగతి సీట్లను భర్తీ చేసేందుకుగాను తెలంగాణ సర్కారు TGCET-2021 నోటిఫికేషన్ విడుదల చేసింది. ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం మే 30న ఈ ప్రవేశ పరీక్ష నిర్వహించాల్సి ఉన్నప్పటికీ.. కరోనా వ్యాప్తిని కట్టడి చేయడం కోసం ప్రస్తుత రాష్ట్ర వ్యాప్తంగా లాక్ డౌన్ అమలులో ఉండటంటో పాటు విద్యార్థిని, విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్టు ప్రవీణ్ కుమార్ (RS Praveen Kumar) తెలిపారు.
Also read : Rythu Bandhu scheme June 2021 installment: రైతుల ఖాతాల్లో రైతు బంధు సాయం: CM KCR
గురుకుల ప్రవేశ పరీక్షకు సంబంధించిన వివరాలను WWW.TGCET.GOV.IN వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవడంతో పాటు ఇతర సందేహాలకు సమాధానం కోసం 040-23120431, 040-23120432 నంబర్లలో సంప్రదించవచ్చని అన్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook