Telangana Health dept Jobs 2022: నిరుద్యోగులకు ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు మరో గుడ్ న్యూస్ చెప్పారు. వైద్య, విద్య, ప్రజారోగ్య విభాగం, ఐపిఎం, టీవీవీపీ విభాగాల్లో మొత్తం 1326 పోస్టులకుగాను ఒకటి రెండు రోజుల్లో నోటిఫకేషన్ ఇవ్వాలని మంత్రి హరీశ్ రావు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మెడికల్ బోర్డు ద్వారా ఈ పోస్టుల భర్తీ చేపట్టాలని అధికారులకు తెలిపారు. నోటిఫికేషన్ విషయంలో ఎలాంటి వివాదాలకు తావులేకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లను పరిగణనలోకి తీసుకుని నోటిఫికేషన్ విడుదల చేయాలని మంత్రి హరీశ్ రావు స్పష్టంచేశారు. కరోనావైరస్ వ్యాప్తి కాలంలో తాత్కాలిక పద్ధతిలో సేవలు అందించిన ఔట్ సోర్సింగ్ సిబ్బందికి 20 శాతం వెయిటేజి మార్కులు ఇవ్వాలని అధికారులకు సూచించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

టెక్నికల్ పోస్టులు, జూనియర్ అసిస్టెంట్, ల్యాబ్ అసిస్టెంట్ వంటి పోస్టులు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్ పీఎస్సీ) ద్వారానే భర్తీ చేయాలని మంత్రి హరీశ్ రావు అధికారులకు వివరించారు.  నిమ్స్‌లోని ఖాళీలను నిమ్స్ బోర్డు ద్వారా భర్తీ చేయాలని.. అలాగే ఆయుష్ విభాగంలోని పోస్టులతో పాటు మిగతా అన్ని పోస్టులను మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారానే భర్తీ చేయాలని మంత్రి హరీశ్ రావు తేల్చిచెప్పారు. అసిస్టెంట్ ఫ్రోఫెసర్లు, సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్టులు, సివిల్ అసిస్టెంట్ సర్జన్లు, స్టాఫ్ నర్సులు, మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్లు, ట్యూటర్లు వంటి పోస్టులన్నీ మెడికల్ అండ్ హెల్త్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా భర్తీ చేయాలని పేర్కొన్నారు.


కరోనా కాలంలో సేవలు అందించిన వారికి 20 మార్కులు వెయిటేజి..
స్టాఫ్ నర్సులకు మల్టిపుల్ ఛాయిస్ విధానంలో రాత పరీక్ష నిర్వహించి, అందులో మెరిట్ మార్కుల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక చేయనున్నట్టు మంత్రి తెలిపారు. ఇందులోనూ రాత పరీక్షకు 80 శాతం మార్కులు, కరోనావైరస్ ప్యాండెమిక్ కాలంలో సేవలు అందించిన వారికి 20 మార్కులు వెయిటేజిగా ఇవ్వాలని అన్నారు. త్వరలోనే వెలువడనున్న ఈ నోటిఫికేషన్‌లో ట్యూటర్స్, సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు ఉండనున్నాయి. ఎంబీబీఎస్ అర్హత కలిగి ఇప్పటికే ఈ పోస్టుల్లో ఔట్ సోర్సింగ్ పద్ధతిలో సేవలు అందిస్తున్న వారికి 20 శాతం వేయిటేజి మార్కులు, మిగతా 80 శాతం మార్కులు వారు ఎంబీబీఎస్ డిగ్రీలో సాధించిన మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపిక చేయనున్నారు. 


పరీక్షల నిర్వహణకు స్టాఫ్ట్‌వేర్ సిద్దం..
ముందుగా తొలి విడత రిక్రూట్మెంట్‌లో భాగంగా 1326 పోస్టులకు నోటిటిఫికేషన్ జారీ చేయనుండగా.. ఆ తర్వాత స్టాఫ్ నర్సులకు, ఇతర పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేయాలని మంత్రి హరీశ్ రావు తెలిపారు. ఇదే విషయమై వైద్య ఆరోగ్య శాఖ సెక్రటరీ మాట్లాడుతూ.. ప్రస్తుతం రాత పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నామని, అందుకోసం స్టాఫ్ట్‌వేర్ కూడా సిద్దం అయిందని తెలిపారు. మంత్రి హరీశ్ రావు (Minister Harish Rao) ఆదేశాల మేరకు మరో రెండు లేదా మూడు వారాల్లో విడతల వారీగా నోటిఫికేషన్ల జారీ ఉంటుందని రిజ్వీ వెల్లడించారు. ఉన్నతాధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. వైద్య ఆరోగ్య శాఖలో మొత్తం 12,755 పోస్టులు భర్తీ చేయనుండగా.. అందులో ఒక్క మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ ద్వారానే 10,028 పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. అందులో భాగంగానే తొలి దశలో 1326 పోస్టులకుగాను రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ వెలువడనుంది.


Also read : TS CPGET-2022: తెలంగాణలో సీపీగెట్‌ దరఖాస్తుల స్వీకరణ షురూ..!


Also read : Hyderabad gang rape case: హైదరాబాద్ గ్యాంగ్ రేప్‌ కేసులో ట్వీస్ట్..రిమాండ్ రిపోర్టులో ఏముందంటే..!


Also read : Gym Trainer: కర్రలతో కొట్టి బూట్లతో తన్ని కాలు విరిచేశారు.. జిమ్‌ ట్రైనర్‌పై హైదరాబాద్ పోలీసుల కిరాతకం


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి