హైదరాబాద్ నీలోఫర్ ఆస్పత్రిలో 'కరోనా వైరస్' అలజడి రేగింది. ఆస్పత్రిలో ఓ చిన్నారికి కరోనా వైరస్ పాజిటివ్ రావడంతో .. ఇప్పుడు ఆస్పత్రిలో కలకలం రేపుతోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నారాయణపేట జిల్లా అభంగాపూర్ గ్రామానికి  చెందిన తల్లిదండ్రులకు 50 రోజుల క్రితం మగబిడ్డ జన్మించాడు. పుట్టిన తర్వాత  అతనికి కరోనా వైరస్ టెస్టులు పూర్తి చేశారు. అప్పుడు నెగెటివ్‌గా నిర్ధారణ అయింది. ఆ  తర్వాత ఏప్రిల్ 8న శిశువుకు టీకాలు వేశారు. అనంతరం జ్వరం వచ్చి ఎంతకూ తగ్గడం లేదు. దీంతో శిశువు తల్లిదండ్రులు కొత్తకొండలోని ఓ ప్రయివేట్ ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అక్కడి నుంచి మహబూబ్ నగర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ  కూడా నయం కాకపోవడంతో హైదరాబాద్ నీలోఫర్ ఆస్పత్రికి పంపించారు. 


నీలోఫర్ ఆస్పత్రిలో శిశువుకు కరోనా వైరస్ పరీక్షలు చేయగా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో ఒక్కసారిగా కలకలం రేగింది. శిశువు తల్లిదండ్రులను ఇద్దరినీ నీలోఫర్‌లోనే క్వారంటైన్‌లో ఉంచారు. మరోవైపు ఈ నెల 15, 16, 17  తేదీల్లో నీలోఫర్ ఆస్పత్రిలో పని చేసిన సిబ్బందిని అందరినీ  క్వారంటైన్‌కు పంపించాలని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ ఆదేశాలు జారీ చేసింది. 


ఏప్రిల్ 20 తర్వాత అనుమతించేవి ఏవి..?


14  రోజులపాటు నీలోఫర్ సిబ్బందిని క్వారంటైన్‌లో ఉంచి పరిశీలిస్తారు. వారిలో ఎవరికైనా జలుబు, దగ్గు, జ్వరం  లాంటి లక్షణాలు కనిపిస్తే కరోనా వైరస్ పరీక్షలు చేస్తారు. ఒకవేళ పాజిటివ్‌గా వచ్చిన వారిని చికిత్స కోసం ప్రత్యేక ఐసోలేషన్  వార్డులకు తరలిస్తారు.  రెండుసార్లు కరోనా వైరస్ పరీక్షల్లో నెగెటివ్ గా నిర్ధారితమైతే వారిని ఇంటికి పంపించేస్తారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..