'కరోనా వైరస్'.. అల్లాడిస్తోంది. దీంతో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ 2.0 కొనసాగుతోంది. తొలుత మార్చి 14 నుంచి 24 వరకు విధించిన లాక్ డౌన్ మే 3 వరకు కొనసాగిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఐతే లాక్ డౌన్ కారణంగా దేశ ఆర్ధిక వ్యవస్థ చిన్నాభిన్నమవుతోంది. కాబట్టి ఏప్రిల్ 20 నుంచి పాక్షిక ఆంక్షలతో కొన్నింటికి అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఐతే ఏప్రిల్ 20 నుంచి ఏ ఏ సేవలకు అనుమతి ఇవ్వనున్నారనే చర్చ దేశవ్యాప్తంగా జరుగుతోంది. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఓ జాబితా విడుదల చేసింది. ఆ జాబితా ఇలా ఉంది.
* ఆర్ధిక సేవలు
@ ఆర్బీఐ లేదా ఆర్బీఐ క్రమబద్దీకరించే ఆర్ధిక మార్కెట్లు
@ బ్యాంకులు, ఏటీఎంలు, బ్యాంకింగ్ సేవలు
@ సెబీ, క్యాపిటల్ మార్కెట్ల సేవలు
@ ఐఆర్‌డీఐ, ఇన్సూరెన్స్ సేవలు
* వాణిజ్య సేవలు
@ ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా
@ ఐటీ సర్వీసులు( 50 శాతం ఉద్యోగులతో మాత్రమే)
@ ప్రభుత్వ యంత్రాంగాలకు అనుబంధంగా నడుస్తున్న డాటా, కాల్ సెంటర్లు
@ ఈ-కామర్స్ సేవలు( ల్యాప్ టాప్, మొబైల్ ఫోన్లు, రిఫ్రిజిరేటర్లు లేకుండా..)
@ కొరియర్ సర్వీసులు
@ కోల్డ్ స్టోరేజ్ అండ్ వేర్‌హౌజింగ్
@ ప్రయివేట్ సెక్యూరిటీ సర్వీసులు, హోటళ్లు
@ స్వయం ఉపాధి ఏర్పాటు చేసుకున్న వారు (ఎలక్ట్రీషియన్లు, ప్లంబర్లు, కార్పెంటర్లు..)
* ఇవి తీసుకోవడానికి జనం వెళ్లవచ్చు
@ నిత్యావసరాలు తీసుకునేందుకు ప్రయివేట్ వాహనాలకు అనుమతి
@ అత్యవసర సేవల కోసం వాహనాలకు అనుమతి
(కానీ కారులో డ్రైవర్‌తోపాటు మరో ఇద్దరు వ్యక్తులకే అనుమతి)
@ ద్విచక్రవాహనంలో ఒక్కరికే అనుమతి
@ పని లేదా ఉద్యోగం కోసం వెళ్లేవారికి అనుమతి
* సామాజిక సేవలు
@ డే కేర్ సెంటర్లు, జువైనల్ సెంటర్లు, వృద్ధాశ్రమాలకు అనుమతి
@ సామాజిక పింఛన్లు ఇచ్చే సంస్థలు, ఈపీఎఫ్ఓకు అనుమతి
@ అంగన్‌వాడీలకు అనుమతి
* వ్యవసాయ పనులు
పొలాల్లో వ్యవసాయ పనులకు అనుమతి
@ వ్యవసాయ ఉత్పత్తులు విక్రయించే ఏజెన్సీలు, దుకాణాలు
@ వ్యవసాయ పనిముట్లు విక్రయించే దుకాణాలు
@ వ్యవసాయ వినియోగదారుల సేవా కేంద్రాలు
@ ఫర్టిలైజర్, విత్తనాలు అమ్మే కేంద్రాలు
@ ధాన్యం కొనుగోలు కేంద్రాలు, మార్కెట్లు
@ చేపల విక్రయ కేంద్రాలు
@ పాల ఉత్పత్తులు విక్రయించే కేంద్రాలు
* వైద్య సేవలు
@ ఆస్పత్రులు, నర్సింగ్ హోమ్ లు
@ టెలీమెడిసిన్ అందించే కేంద్రాలు
@ డిస్పెన్సరీలు, మెడికల్ దుకాణాలు
@ మెడికల్ రీసెర్చ్ సెంటర్లు, ల్యాబ్‌లు
@ ప్రభుత్వం గుర్తించిన ప్రయివేట్ ల్యాబ్‌లు
@ వెటర్నరీ ఆస్పత్రులు
@ పిల్లలకు వ్యాక్సిన్ వేసే కేంద్రాలు
* పారిశ్రామిక వ్యవస్థకు సంబంధించిన సేవలు
@ రూరల్ ప్రాంతాల్లో ఉన్న పరిశ్రమలు
@ సెజ్‌లలో ఎగుమతులు చేసే యూనిట్లు
@ ఇండస్ట్రియల్ టౌన్ షిప్‌లు
@ నిత్యావసరాలు తయారు చేసే యూనిట్లు
ఐటీ, హార్డ్‌వేర్ కంపెనీలు
@ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు
@ జనప తయారీ యూనిట్లు
@ బొగ్గు, ఖనిజ ఉత్పత్తులు
@ నిర్మాణ పనులు(రోడ్లు, ఇరిగేషన్ ప్రాజెక్టులు)
* కార్గో, నిత్యావసర వస్తు రవాణా
@ అంతర్రాష్ట్ర వస్తు రవాణా సేవలు
(విమాన, రైలు, షిప్‌ల ద్వారా ..)
@ నిత్యావసరాల కోసం వెళ్లే ట్రక్కులు
* అదనపు సేవలు
@ అటవీ ఉత్పత్తులు, నాన్ టింబర్ ఉత్పత్తులు
@ వెదురు, కొబ్బరి ఉత్పత్తులు
@ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్ సర్వీసులు
(హౌసింగ్, మైక్రో ఫైనాన్స్ కంపెనీలు)
@ గ్రామీణ ప్రాంతాల్లో నిర్మాణ పనులు
(శానిటేషన్, పవర్, టెలికమ్‌కు సంబంధించినవి)
* మొత్తంగా మూసి ఉండేవి
@ దేశీయ, అంతర్జాతీయ విమాన ప్రయాణాలు
@ ప్రయాణీకుల రైళ్లు, బస్సులు, మెట్రోలు, ట్యాక్సీలు
@ అంతర్రాష్ట్ర రవాణా( సెక్యూరిటీ, మెడికల్ సర్వీసులు కాకుండా)
@ ఇండస్ట్రియల్, కమర్షియల్ సేవలు
@ విద్య, శిక్షణ, కోచింగ్ సెంటర్లు
@ సినిమా హాళ్లు, షాపింగ్ మాళ్లు, జిమ్ లు, వినోద పార్కులు
@ స్పోర్ట్స్ కాంప్లెక్సులు, గుళ్లు, మసీదులు, చర్చిలు
ఐతే ఇప్పటికే హాట్ స్పాట్స్ గా గుర్తించిన ప్రాంతాల్లో, కంటైన్ మెంట్ జోన్లలో మాత్రం ఏప్రిల్ 20 నుంచి కూడా ఎలాంటి ఆంక్షలతోనూ సేవలకు అనుమతించడం లేదని కేంద్రం స్పష్టం చేసింది.జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..