DH Srinivas on Covid Third Wave : దేశంలో కరోనాతోపాటు ఒమిక్రాన్ కేసులు (Omicron) పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకులు(డీహెచ్) డా.శ్రీనివాసరావు (DR Srinivasra Rao) కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే నాలుగు వారాలు చాలా ముఖ్యమని...ఫ్రిబవరి నెలలో మళ్లీ కేసులు తగ్గే అవకాశం ఉందని ఆయన అన్నారు. తెలంగాణలో జనవరి 1 నుంచి కరోనా కేసుల (Corona Cases in Telangana) పెరుగుదల ప్రారంభమైందని ఆయన అన్నారు. రాష్ట్రంలో గత 5 రోజుల్లో 4 రెట్లకు పైగా కేసులు నమోదయ్యాయని చెప్పారు. భవిష్యత్​లో 90 శాతం కేసులు ఒమిక్రాన్​వే ఉంటాయని ఆయన అన్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సెలవులు రద్దు..
''ప్రజారోగ్య సిబ్బందికి ఇవాల్టి నుంచి సెలవులు రద్దు చేస్తున్నాం. వచ్చే 4 వారాలు ఎలాంటి సెలవులు ఉండవు. రాజకీయ నాయకులు,  పార్టీలు, ప్రజా సంఘాలు వచ్చే నాలుగు వారాలు కార్యక్రమాలను నియంత్రించుకోవాలి. దీన్ని రాజకీయ పార్టీలు బాధ్యతగా తీసుకోవాలి. రాబోయే రోజుల్లో 1 శాతం మంది ఆస్పత్రిలో చేరాల్సి వచ్చినా ఆరోగ్య సదుపాయ పరంగా భారం అయ్యే అవకాశం ఉంది. అన్ని సరిహద్దుల్లో వైద్య బృందాలు సిద్ధంగా ఉన్నాయి’'' అని డీహెచ్‌ వెల్లడించారు. 


Also Read: TSRTC Cashless Ticket: తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం.. చేతిలో డబ్బులేకున్నా ఆర్టీసీలో ప్రయాణం


మూడోవేవ్ ను ఎదుర్కొనేందుకు సిద్ధం..
కరోనా మూడో దశను (Covid third Wave) ఎదుర్కొనేందుకు పూర్తి సన్నద్ధంగా ఉన్నామని డీహెచ్ అన్నారు. కోటికి పైగా హోం ఐసోలేషన్ కిట్లను సిద్ధంగా ఉంచామన్న ఆయన.. ర్యాపిడ్‌తో పాటు ఆర్టీపీసీఆర్ పరీక్షలు కూడా చేస్తున్నామని చెప్పారు. సంక్రాంతితో పాటు మరికొన్ని పండుగలు రాబోతున్నందున.. ఈనెల 8 నుంచి పాఠశాలలు, కళాశాలలకు సెలవులు ప్రకటించామని పేర్కొన్నారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తే మూడో దశ నుంచి త్వరగా బయటపడవచ్చని పేర్కొన్నారు. 15-18 ఏళ్ల వయసు గల వారికి 10 శాతం మందికి తొలి డోసు ఇచ్చామని డీహెచ్ చెప్పారు. 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.