TSRTC Cashless Ticket: తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం.. చేతిలో డబ్బులేకున్నా ఆర్టీసీలో ప్రయాణం

TSRTC Cashless Ticket: తెలంగాణ ఆర్టీసీ సంస్థ మరీ కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. రాష్ట్ర రోడ్డు రవాణాకు సంబంధించిన బస్సుల్లో నగదు రహిత లావాదేవీలను అమలులోకి తీసుకురానున్నట్లు ఆ సంస్థ ఎండీ సజ్జనార్ ప్రకటించారు. అయితే తొలుత ఈ కొత్త విధానాన్ని హైదరాబాద్, సికింద్రాబాద్‌ నుంచి జిల్లాలకు వెళ్లే బస్సుల్లో అమలు చేయాలని అధికారులు భావిస్తున్నారు.   

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 6, 2022, 01:26 PM IST
TSRTC Cashless Ticket: తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం.. చేతిలో డబ్బులేకున్నా ఆర్టీసీలో ప్రయాణం

TSRTC Cashless Ticket: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ గా సజ్జనార్‌ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆర్టీసీలో కీలక మార్పులు జరుగుతున్నాయి. టిఎస్ ఆర్టీసీలో ప్రయాణించే వారికి ఇప్పటికే అనేక కొత్త వెసులుబాటులు కల్పించిన సజ్జనార్... ఇప్పుడు మరో కొత్త నిర్ణయాన్ని తీసుకున్నాడు. 

ఆర్టీసీ బస్సులో ప్రయాణించే ప్రతి ఒక్కరికీ చిల్లర కష్టాలు కామన్. ఈ నేపథ్యంలో బస్సుల్లో చిల్లర కష్టాలకు చెక్‌ పెట్టేందుకు గాను టికెట్‌ తీసుకునే సమయంలో నగదు రహిత లావాదేవీ విధానాన్ని అందుబాటులోకి తీసుకురానుంది.

ఈ క్రమంలో ప్రతి ఆర్టీసీ బస్సులో డెబిట్ లేదా క్రెడిట్ కార్డుల ద్వారా టికెట్ ను కొనుగోలు చేసే విధానాన్ని అమలులోకి తీసుకురానున్నట్లు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ప్రకటించారు. అయితే తొలుత ఈ కొత్త విధానాన్ని హైదరాబాద్, సికింద్రాబాద్‌ నుంచి జిల్లాలకు వెళ్లే బస్సుల్లో అమలు చేయాలని అధికారులు భావిస్తున్నారు. 

నగదు రహిత, లావాదేవీల్లో భాగంగా ఆర్టీసీ ఇప్పటికే గ్రేటర్‌ హైదరాబాద్‌లో ఉన్న బస్‌పాస్‌ కేంద్రాల్లో క్యూఆర్‌ కోడ్‌తో చెల్లింపుల విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ విధానం ద్వారా చిల్లర కష్టాలకు చెక్‌ పెట్టడం సహా వినియోగదారులకు శ్రమ తగ్గుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

ఇక జిల్లాలకు వెళ్లే 900 బస్సుల్లో తొలుత కార్డు చెల్లింపులు అందుబాటులోకి తీసుకొచ్చి.. ఫలితం ఆధారంగా ఇతర బస్సుల్లోనూ ఈ విధానాన్ని అమలు చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఇక టీఎస్‌ఆర్టీసీ వెబ్‌సైట్‌లో టికెట్లు బుక్‌ చేసుకునే వారు యూపీఐ పేమెంట్స్‌ చేసుకునే విధంగా ఆర్టీసీ అవకాశం కల్పించిన విషయం తెలిసిందే. 

Also Read: Sankranti Holidays: తెలంగాణలో ఇంటర్ కాలేజీలకు సంక్రాంతి సెలవులు...

Also Read: Breaking News: తెలంగాణ వ్యాప్తంగా జనవరి 10న బంద్ కు పిలుపునిచ్చిన బీజేపీ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News