విష జ్వరాలపై మంత్రి ఈటల ఏమన్నారంటే..
విష జ్వరాలపై మంత్రి ఈటల ఏమన్నారంటే..
హైదరాబాద్: రాష్ట్రంలో ప్రబలుతున్న విషజ్వరాలపై తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో మంత్రి ఈటల రాజేందర్ స్పందించారు. విషజ్వరాలు వ్యాపిస్తున్న విషయం వాస్తవమే కానీ అనవసర ఆరోపణలతో ప్రజలను భయబ్రాంతులకు గురిచేయొద్దని మంత్రి ఈటల సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా వైద్యశాఖలో ఖాళీల భర్తీపై స్పందించిన మంత్రి ఈటల.. 9,381 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం అనుమతి జారీచేసిందని.. త్వరలోనే ఆ ఖాళీల భర్తీ ప్రక్రియ చేపడతామని ప్రకటించారు.