హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటివరకు కరోనా మహమ్మారి సామాజిక వ్యాప్తి జరగలేదని, కొత్త కేసులు నమోదు కానీ జిల్లాలున్నాయని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. తబ్లీఘీ జమాత్ కు చెందిన మర్కజ్‌ ఘటన తదనంతరమే తెలంగాణలో కరోనా కేసులు పెరిగాయని, 1250 మందికి పైగా ఢిల్లీ మర్కజ్‌ వెళ్లినట్లు సమాచారం ఉందని, వీరందరినీ గుర్తించి పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Read Also: లాహోర్ లో మంచు కురవొచ్చేమో గానీ, భారత్ పాక్ ల మధ్య ద్వైపాక్షిక సీరీస్ కష్టమే... గవాస్కర్


కట్టుదిట్టమైన పద్దతిలో వివిధ ప్రాంతాల్లో ప్రతి ఒక్కరి ఆరోగ్య వివరాలను సేకరిస్తున్నామని, కరోనాపై సీఎం కేసీఆర్‌ నిరంతరం సమీక్షలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా డయాలసిస్‌, తలసేమియా రోగులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నామని, వారికి వైద్య సేవలు అందిస్తున్నామన్నారు. రాష్ట్రంలో ప్రతి రోజు సుమారుగా 1200 కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 


Also read : ఎంసెట్, ఐసెట్, పాలిసెట్, పీజీసెట్, లా సెట్ పరీక్షలకు తేదీలు ప్లానింగ్ ?


మరోవైపు జీహెచ్‌ఎంసీ పరిధిలో కరోనా కట్టడికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని, నిర్దేశిత ప్రాంతాల్లో పకడ్బందీగా లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నామని, నియంత్రిత ప్రాంతాల్లోని ప్రజలకు అవసరమైన సరుకులను అందిస్తున్నట్లు తెలిపారు. ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే కరోనా లక్షణాలు లేకపోయినా కొంతమందికి పాజిటివ్‌ వస్తోందని, కరోనా సోకిన వారు నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉందని, నిర్లక్ష్యంగా ఉండొద్దని, ప్రభుత్వ సలహాలు పాటించాలని తెలిపారు. 


 జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 


Read Also: Protest against lockdown: లాక్‌డౌన్‌కి వ్యతిరేకంగా భగ్గుమన్న నిరసన.. పోలీసుల లాఠీఛార్జ్