Heavy Rains: తెలంగాణలో గత నాలుగైదు రోజులుగా మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. ఫలితంగా హుస్సేన్ సాగర్ సహా పలు జలాశయాలు నిండుకుండలా మారుతున్నాయి. దీనికితోడు రానున్న 4 రోజులు కూడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర సమీపంలోని వాయువ్య బంగాళాఖాతం, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఈ నెల 24వ తేదీన అల్పపీడనం ఏర్పడనుంది. ఫలితంగా తెలంగాణలో మరో నాలుగైదు రోజులు భారీ వర్షాలు పడనున్నాయని ఐఎండీ తెలిపింది. ముఖ్యంగా ఉమ్మడి అదిలాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాలు, కొత్తగూడెం, నిజామాబద్ జిల్లాల్లో ఇవాళ మోస్తరు వర్షాలు నమోదయ్యాయి. మిగిలిన చోట్ల భారీ వర్షాలు పడవచ్చు. ఇప్పటికే కురుస్తున్న వర్షాలతో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇప్పుడు మరో నాలుగైదు రోజులు భారీ వర్షాల హెచ్చరిక ఉండటంతో అధికారులు అప్రమత్తమౌతున్నారు. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు హిమాయత్ సాగర్ నిండిపోయింది. ప్రాజెక్టులోని ఆరు గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదిలేశారు. మరోవైపు మూసీ నది పరిసర ప్రాంతాల ప్రజలకు హెచ్చరిక జారీ చేశారు. హిమాయత్ సాగర్ నుంచి 4120 క్యూసెక్కుల నీళ్లు మూసీ నదిలోకి వదిలారు. 


తెలంగాణతో పాటు హైదరాబాద్‌లోని చార్మినార్, ఖైరతాబాద్, కూకట్‌పల్లి, ఎల్బీనగర్, సికింద్రాబాద్, శేర్‌లింగం పల్లి ప్రాంతాల్లో ఈ నెల 24 వరకూ తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు పడనున్నాయి. ఆ తరువాత భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయి. 


మరోవైపు దేశంలోని పలు ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు పడుతున్నాయి. మహారాష్ట్ర, గోవా, గుజరాత్ రాష్ట్రాల్లో రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఇక ఉత్తరాఖండ్, రాజస్థాన్, మధ్య ప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ అయింది.


Also read: Heavy Rains: ఏపీలో ఆ జిల్లాలకు భారీ వర్షాలు, రెడ్ అలర్ట్ జారీ



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook